తెలంగాణకు వాతావరణ శాఖ భారీ హెచ్చరిక
తెలంగాణలో మరో ఆరు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపటి నుంచి పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరో ఆరు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.తేలికపాటి నుంచి మోస్తరు లేదా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈ మేరకు మంగళవారం ప్రకటన జారీ చేసింది. 29 ఆగస్టు, 2024 నాటికితూర్పు మధ్య, ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళా ఖాతంలో తాజా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తదుపరి 2 రోజుల్లో ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒరిస్సా.. ఉత్తర ఆంధ్రప్రదేశ్ కు దగ్గరగా వెళ్లే అవకాశం ఉంది.

వీటి ప్రభావంతో తెలంగాణలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది.ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 2వ వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ పేర్కొంది.












Click it and Unblock the Notifications