'మహిళల సెంటిమెంటుతో ఆడుకుంటోన్న మోడీ ప్రభుత్వం, కేసీఆర్ జవాబేది'

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: మహిళల సెంటిమెంటుతో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆటలు ఆడుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ శుక్రవారం నాడు నిప్పులు చెరిగారు. నోట్ల రద్దు, తదనంతర పరిణామాలు, బంగారంపై పరిమితుల పైన కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసన మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ, సీనియర్ నేత దానం నాగేందర్ తదితరులు మాట్లాడారు.

పవన్ కళ్యాణ్‌తో పావులు, చంద్రబాబు ఏం చేస్తారు?

ప్రధాని నరేంద్ర మోడీ వస్తే అచ్చే దిన్ వస్తుందని ప్రచారం చేశారని, కానీ బూరేదిన్ వచ్చిందని ధ్వజమెత్తారు. బంగారం పైన లెక్కలు చెప్పాలన్న కేంద్రం నిర్ణయం పైన తాము సంతకాలు సేకరిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తుగ్లక్ నిర్ణయంపై ఇంటింటికి ప్రచారం చేస్తామని చెప్పారు. మహిళల సెంటిమెంటుతో కేంద్రం ఆడుకుంటోందన్నారు.

 'Modi government is playing with Women sentiment'

షబ్బీర్ అలీ, ఉత్తమ్ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన నిప్పులు చెరిగారు. కేసీఆర్ అబద్దాలు ఆడటంలో దిట్ట అని షబ్బీర్ మండిపడ్డారు. సంక్షేమ పథకాలను గాలికి వదిలేశారని చెప్పారు. రైతులను, విద్యార్థులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ రెండున్నరేళ్లు కేసీఆర్ ప్రభుత్వానికి ఎమ్మెల్యేలను కొనడానికే సరిపోయిందన్నారు. నక్సల్స్ అజెండా అమలు చేస్తామని చెప్పి, బూటకపు ఎన్‌కౌంటర్లు చేస్తున్నారన్నారు. విలాసాలకు అలవాటు పడ్డారని ధ్వజమెత్తారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఏమయిందో చెప్పాలన్నారు. నయీం కేసులో ఇప్పటి వరకు ఒక్కర్నీ అరెస్టు చేయలేదన్నారు. ఎంసెట్ లీక్ దర్యాఫ్తు ఏమయిందో చెప్పాలన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
PM Narendra Modi government is playing with Women sentiment, alleged Congress leaders.
Please Wait while comments are loading...