అజహరుద్దీన్‌కు ఊరట: ఆ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీమిండియా మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత మొహమ్మద్ అజహరుద్దీన్‌కు కోర్టులో భారీ ఊరట లభించింది. అజహరుద్దీన్‌కు మల్కాజిగిరికోర్టు ముందస్తు బెయిల్ లభించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)కు చెందిన నిధుల్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో అజహరుద్దీన్ తోపాటు మరికొంత మందిపై నాలుగు కేసులు నమోదయ్యాయి.
ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ అజహరుద్దీన్ మల్కాజిగిరి కోర్టును ఆశ్రయించారు. ఉప్పల్ స్టేడియంలో జిమ్ తోపాటు బంతుల కొనుగోలు, కుర్చీల ఏర్పాటులో అక్రమాలకు పాల్పడ్డారంటూ నమోదైన కేసులో వాస్తవం లేదని అజహరుద్దీన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

వాదనలు విన్న కోర్టు.. అజహరుద్దీన్‌కు 41ఏ నోటీసులిచ్చి ప్రశ్నించాలని ఉప్పల్ పోలీసులను ఆదేశించింది. అజహరుద్దీన్ ప్రస్తుతం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న విషయం తెలిసిందే.
కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో అజారుద్దీన్ కు ఊరట లభించినట్లయింది.
ఎన్నికలు దగ్గరపడుతుండటంతో జూబ్లీహిల్స్‌లో అజహరుద్దీన్ ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. పలు ప్రాంతాల్లో పర్యటించి తనను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను వివరిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో భారీ మెజారిటీతో గెలుస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే, జూబ్లీహిల్స్‌లో అజహరుద్దీన్‌కు బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ స్థానం నుంచి కూడా పోటీ చేస్తామని ఎంఐఎం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామం బీఆర్ఎస్ అభ్యర్థికిగా అనుకూలంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications