అజారుద్దీన్ థర్డ్ ఇన్నింగ్స్?: అమెరికా భామ షనోన్‌తో మూడో పెళ్లి...!
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాదీ క్రికెటర్ మహమ్మద్ అజహరుద్దీన్ 52 ఏళ్ల వయసులో అతడు ముచ్చటగా మూడో సారి పెళ్లి చేసుకున్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను అజారుద్దీన్ ఖండించాడు.
గతంలో నౌరీన్ అనే మహిళను పెళ్లి చేసుకున్న అజారుద్దీన్, ఆ తర్వాత కొన్నాళ్లకే ఆ పెళ్లి పెటాకులు కాగా, బాలీవుడ్ అందాల నటి సంగీతా బిజిలానీతో రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 1996లో జరిగిన ఈ పెళ్లి 2010లో విడాకులకు దారి తీసింది.
ఆ తర్వాత 2012లో తనకు పరిచయమైన అమెరికా దేశస్థురాలు, ఫ్యాషన్ డిజైనర్ షనోన్ మేరీని అతడు ఇటీవలే పెళ్లి చేసుకున్నాడు. 2013లో ప్యారిస్‌లో వీరిద్దరూ సెలవులను ఎంజాయ్ చేశారన్న వార్తలు వినిపించాయి.

ఇటీవలే భారత్‌లో జరిగిన ఐటీపీఎల్ టెన్నిస్ మ్యాచ్‌ను వీక్షించేందుకు స్టేడియానికి వచ్చిన ఆజారుద్దీన్ వెంట మేరీ కూడా వుంది. ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని మరీ మ్యాచ్‌ను ఎంజాయ్ చేశారు. అంతేకాదు తాజాగా ఇటీవలే చనిపోయిన తన కారు డ్రైవర్ జాన్ మహ్మద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఇద్దరూ కలిసే వెళ్లారు.
అక్కడి వారికి ఆమెను తన భార్యగా పరిచయం చేశాడని సమాచారం. అయితే ఈ వార్తలను మాత్రం అజారుద్దీన్ ఖండించాడు. ‘‘నేను మూడో పెళ్లి చేసుకున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. పత్రికల్లో రాసే ముందు నిజానిజాలు తెలుసుకోవాలి'' అని తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.
News about my 3rd marriage is incorrect and false. Please check facts before publishing @timesofindia @DainikBhaskar @dna @ZeeNews
— Mohammed Azharuddin (@azharflicks) December 20, 2015 











Click it and Unblock the Notifications