భార్య సహయంతో కోడలిపై అత్యాచారం: బిడ్డకు జన్మనిచ్చిన కోడలు, డిఎన్ఏ పరీక్షతో ఇలా..

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: కన్న కూతురిగా చూడాల్సిన కోడలిపై భార్య సహకారంతోనే పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు మోహన్ దాస్ అనే 60 ఏళ్ళ వ్యక్తి. దీంతో కోడలు గర్భం దాల్చి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే కోడలికి ఈ విషయమై అనుమానం వచ్చి డిఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తే తనకు పుట్టిన కొడుకు మామా ద్వారానే పుట్టాడని తేలింది. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన హైద్రాబాద్‌లో చోటు చేసుకొంది.

దారుణం: రెండున్నర ఏళ్ళుగా ఉద్యోగినిపై నలుగురు రేప్, వీడియో తీసి ఇలా...

మహిళలపై రోజు రోజుకు అత్యాచారాలు, లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయి. ఇంటి నుండి బయటకు వెళ్లిన మహిళలకు రక్షణ లేదని ఆందోళన చెందుతున్న తరుణంలో ఇంట్లో ఉన్న మహిళలకు కూడ రక్షణ లేదని హైద్రాబాద్ చిలకలగూడలో చోటు చేసుకొన్న ఘటనతో తేటతెల్లమైంది.

షాక్: పోలీస్ భార్యపై అత్యాచారం, బెయిల్‌ కోసం రూ. 5 లక్షలు

మహిళల రక్షణ కోసం పాలకులు అనేక చట్టాలను తీసుకొచ్చినా... ఈ తరహ ఘటనటు కొనసాగుతుండడం దురదృష్టకరం. అయితే మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షిస్తే ఈ తరహ ఘటనలు పునరావృతమయ్యే అవకాశాలు ఉండకపోవచ్చనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

షాక్: భర్తను కట్టేసి భార్యపై గ్యాంగ్‌రేప్, 3 రోజులపాటు నలుగురిలా..

కోడలిపై అత్యాచారం

కోడలిపై అత్యాచారం

హైద్రాబాద్ చిలకలగూడకు చెందిన 60 ఏళ్ళ మోహన్‌దాస్‌కు ముగ్గురు భార్యలున్నారు. అయితే అతని కుమారుడు, కోడలు కూడ మోహన్‌దాస్ ఉండే ఇంట్లోనే మూడో అంతస్థులో నివాసం ఉంటారు. ముగ్గురు భార్యలున్న మోహన్‌దాస్ కోడలిపై కన్నేశాడు. దీంతో కోడలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పలు మార్లు కోడలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కోడలికి తెలియకుండానే నిందితుడు ఈ దుర్మార్గానికి తెగబడ్డాడు.

కోడలిపై అత్యాచారానికి భార్య సహకారం

కోడలిపై అత్యాచారానికి భార్య సహకారం

కోడలిపై కన్నేసిన మోహన్‌దాస్‌కు ఆయన మూడో భార్య భారతి సహకరించింది. ఆమె సహకారంతోనే కోడలిపై పలు మార్లు మోహన్‌దాస్ అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు. ప్రూట్ జ్యూస్‌లో మోహన్‌దాస్ మూడో భార్య మత్తు మందు కలిపి ఇచ్చేది. అయితే ఈ జ్యూస్ తాగి కోడలు మత్తులోకి వెళ్ళాక మోహన్‌దాస్ ఆమెపై అత్యాచారానికి పాల్పడేవాడు. వీలు చిక్కినప్పుడల్లా మోహన్‌దాస్ కోడలిపై అత్యారానికి పాల్పడ్డాడు.

గర్భం దాల్చిన కోడలు

గర్భం దాల్చిన కోడలు

మోహన్‌దాస్ వీలు చిక్కినప్పుడల్లా కోడలిపై అత్యాచారానికి దిగడంతో ఆమె గర్భం దాల్చింది. అంతేకాదు కొడుకుకు జన్మనిచ్చింది. అయితే ఈ విషయమై బాధితురాలికి అనుమానం వచ్చింది.దీంతో అత్త, మామలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో అసలు విషయాలు వెలుగు చూశాయి.

డిఎన్ఏ పరీక్షలో బయటపడిన వాస్తవం

డిఎన్ఏ పరీక్షలో బయటపడిన వాస్తవం


కోడలికి పుట్టిన కొడుకు రక్తాన్ని డిఎన్ఏ పరీక్షలకు పంపారు పోలీసులు. మోహన్‌దాస్ డిఎన్ఏతో బాబు డిఎన్ఏ సరిపోయిందని పోలిసులకు నివేదిక అందింది. ఈ నివేదిక ఆధారంగా అత్త భారతిని పోలీసులు అరెస్ట్ చేశారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మోహన్‌దాస్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకొన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mohandas arrested for rape on daughter in law at Hyderabad on Saturday.This incident happened in Chalakaguda . victim complainted to police.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి