Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

డ్రగ్స్: ఆ హీరోయిన్ ఎక్కడికి పిలిచినా వస్తుందని కెల్విన్, ఓ హీరో అరెస్ట్ ఖాయమా?

డ్రగ్స్ రాకెట్‌తో లింకులు ఉన్న సినీ ప్రముఖలను ఈ నెల 19 నుంచి 25 వరకు విచారించనున్నారు. ఇప్పటికే డ్రగ్స్ దందాతో లింకులున్న నిందితులను సిట్ కార్యాలయంలో విచారిస్తున్నారు.

హైదరాబాద్: డ్రగ్స్ రాకెట్‌తో లింకులు ఉన్న సినీ ప్రముఖలను ఈ నెల 19 నుంచి 25 వరకు విచారించనున్నారు. ఇప్పటికే డ్రగ్స్ దందాతో లింకులున్న నిందితులను సిట్ కార్యాలయంలో విచారిస్తున్నారు.

సినీ ప్రముఖులను సిట్ ఆఫీసులో విచారించే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రముఖుల ఇమేజ్‌కు భంగం కలగకుండా రహస్య ప్రదేశంలో విచారించనున్నారని తెలుస్తోంది. విచారణకు సంబంధించిన వివరాలు ఆ రోజే వారికి ఫోన్ ద్వారా చెప్పనున్నారు.

వారి అసిస్టెంట్లను మాత్రం సిట్ కార్యాలయంలోనే విచారించనున్నారని సమాచారం. వారికి ముందుగా ఎలాంటి సమాచారం అందదని ఈ నెల 19 నుంచి 25 మధ్య వారిని విచారించనున్నారని తెలుస్తోంది.

కెల్విన్ వలలో ఎందరో..

కెల్విన్ వలలో ఎందరో..

డ్రగ్స్ వ్యాపారంలో ఆరితేరిన కెల్విన్‌ మెల్లగా తెలుగు సినీ పరిశ్రమపై కన్నేశాడు. దాదాపు నాలుగేళ్ల క్రితమే అతడికి పరిశ్రమతో బంధం ఏర్పడింది. ప్రధానంగా ఎల్‌ఎస్డీ దిగుమతి చేసుకొని సరఫరా చేసేవాడు. తొలుత ఓ దర్శకుడితో పరిచయం చేసుకున్నాడు. క్రమంగా పరిచయాలను విస్తరించుకుంటూ అనేకమందికి సరఫరా చేయడం ప్రారంభించాడు.

Recommended Video

    Tollywood actress Swathi Reddy clashes with mother in police station
    హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు..

    హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు..

    ఇద్దరు యువ హీరోలు, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కీలక పాత్రలు పోషిస్తున్న మరో నటుడు, ఒక ఆర్ట్‌ డైరెక్టర్‌, మరో కొరియోగ్రాఫర్ పేర్లు విచారణలో కెల్విన్ చెప్పడంతో వారికి అధికారులు నోటీసులు జారీ చేశారు.

    అధికారులు షాక్.. హీరోయిన్ బానిస

    అధికారులు షాక్.. హీరోయిన్ బానిస

    కెల్విన్‌ ఫోన్‌ను విశ్లేషించారు. అవి చూసి అధికారులు షాకయ్యారని తెలుస్తోంది. ప్రధానంగా ఒక మాజీ హీరోయిన్‌ ఎల్‌ఎస్డీకి పూర్తిగా బానిస అయిందని కెల్విన్ విచారణలో చెప్పాడని తెలుస్తోంది. ఆమె నేను ఎక్కడకు పిలిస్తే అక్కడకు వస్తుందని, ఇప్పుడు పిలిపించమంటారా అని కూడా అధికారులతో కెల్విన్ చెప్పాడని సమాచారం. దీంతో షాకవ్వడం వారి వంతయింది. ఐటం సాంగుల్లో ఒకప్పుడు ఊపేసిన మరో నటి అయితే మత్తుమందుల కోసం రకరకాలుగా ఒత్తిడి చేసేదని తెలుస్తోంది.

    వారి మృతి డ్రగ్స్ వల్లే

    వారి మృతి డ్రగ్స్ వల్లే

    ఇటీవల ఓ సంగీత దర్శకుడి అకాల మృతికి డ్రగ్స్ కారణమని తెలుస్తోంది. అతనికి కెల్విన్ డ్రగ్స్ సరఫరా చేసేవాడను. ఆయన చనిపోయిన సమయంలో తన వ్యవహారం బయటపడుతుందని భయపడ్డానని అతను విచారణలో చెప్పాడని తెలుస్తోంది. డ్రగ్స్ లేకపోతే ఉండలేని పరిస్థితికి చాలా మంది వచ్చారని తెలుస్తోంది. ఇటీవల ఓ నటుడు కూడా అలాగే మృతి చెందాడని చెప్పినట్లు తెలుస్తోంది.

    తొలి టార్గెట్ అతను

    తొలి టార్గెట్ అతను

    సినీ పరిశ్రమలో ఎల్‌ఎస్డీకి అలవాటుపడ్డ వారిలో చాలామంది మత్తుకు అలవాటుపడిన ఓ దర్శకుడి శిష్యులేనని తెలుస్తోంది. ఆయన తొలుత తాను ఈ రొంపిలోకి దిగి మిగతా వారికీ అలవాటు చేసినట్లుగా ప్రచారం సాగుతోంది.

    ఓ హీరో అరెస్ట్ తథ్యమంటూ..

    ఓ హీరో అరెస్ట్ తథ్యమంటూ..

    ఇదిలా ఉండగా, ఓ టాప్ యువ హీరో తన డ్రైవర్‌ ద్వారా కొకైన్‌ తెప్పించుకునే వాడని విచారణలో తేలిందని సమాచారం. ఆ ఇధ్దరినీ అరెస్టు చేసేందుకు ఇప్పటికే అధికారులు ఉచ్చు బిగించినట్లుగా తెలుస్తోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+