ఇంట్లోకి వచ్చిన దొంగలకే వణుకు పుట్టించిన తల్లీ కూతుళ్ళు.. వీడియో వైరల్!!
సహజంగా ఇంట్లోకి ఎవరైనా అపరిచిత వ్యక్తులు వస్తే.. కత్తులు, తుపాకులతో బెదిరిస్తే ఏం చేస్తారు? ఎంతటి వారైనా భయపడి వారు చెప్పింది చేసేస్తారు.. వారు అడిగింది ఇచ్చేస్తారు. కానీ కాస్త ధైర్యంగా పోరాటం చేస్తే ఇంట్లో దోపిడీకి వచ్చిన దొంగలకు కూడా వెన్నులో వణుకు పుట్టించవచ్చు అని నిరూపించారు ఒక తల్లిదండ్రులు.
హైదరాబాద్లోని బేగంపేట లోని ఓ కాలనీలో అకస్మాత్తుగా ఓ ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు ఆ ఇంట్లో నివాసం ఉంటున్న ఆర్కే జైన్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. కొరియన్ పేరుతో ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు అగంతకులు తుపాకీ, కత్తి చూపించి తల్లి కూతుర్లను బెదిరించి దోపిడీకి ప్రయత్నించారు. తల్లి తలపై తుపాకి ఎక్కుపెట్టి, కూతురిని కత్తితో బెదిరించి ఇంట్లో ఉన్న డబ్బు, నగలు ఇవ్వాలని, లేదంటే చంపేస్తాం అంటూ బెదిరించారు.

అయితే దొంగల బెదిరింపులకు బెదరని తల్లి కూతుర్లు ఒక్కసారిగా వారిపై తిరగబడ్డారు. తుపాకులు కత్తులతో ఇంట్లోకి చొరబడిన ఆగంతుకులతో వీరోచితంగా పోరాడారు. దొంగల్లో ఒకరిని పట్టుకుని గదిలో బంధించి, మరొకరిని పట్టుకోవడానికి ప్రయత్నించిన క్రమంలో అతను వారి నుండి తప్పించుకొని పారిపోయాడు. అయితే తల్లి కూతుళ్ళు దొంగలతో పోరాడిన వీరోచిత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది.
ముఖాలు కనిపించకుండా ఒకరు మాస్కు, మరొకరు హెల్మెట్ పెట్టుకుని దోపిడీకి ప్రయత్నం చేయగా, వారి భరతం పట్టారు తల్లి కూతుళ్లు. దొంగలను పట్టుకొని పోలీసులకు అప్పగించాలని ప్రయత్నం చేసిన వారు ఎట్టకేలకు చివరికి ఒక దొంగను స్థానికుల సహాయంతో పోలీసులకు అప్పగించారు. అయితే ఈ కేసులో చోరీకి పాల్పడిన వ్యక్తిని పట్టుకున్న పోలీసులు, అతను గతంలో వారి ఇంట్లో పనిచేసిన వ్యక్తిగా గుర్తించారు.
ఇంట్లోకి వచ్చిన దొంగలకే వణుకు పుట్టించిన తల్లీ కూతుళ్ళు.. వీడియో వైరల్..!! pic.twitter.com/nWCZ1aWDh4
— oneindiatelugu (@oneindiatelugu) March 22, 2024
ఇక మరో అగంతకుడిని హన్మకొండ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్లో పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను దొంగ తో పోరాటం చేసిన తల్లి కూతుళ్ళ సాహసం చూసిన వారందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రతి ఒక్కరు ఈ విధంగా ఉంటే దొంగతనాలు చేయాలంటే దొంగలు భయపడతారు అని ఈ వీడియో చూసిన వారు చర్చించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications