దారుణం: భర్త అనుమానించాడని.. నెలరోజుల కన్నబిడ్డను రోడ్డుపై పడేసింది
హైదరాబాద్: నగరంలోని మెహదీపట్నం ప్రాంతంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనను భర్త అనుమానిస్తుడనే నెపంతో కన్న బిడ్డను రోడ్డుపై పడేసింది ఓ మహిళ. సోమవారం రాత్రి చోటు చేసుకుందీ ఘటన.
భార్యపై అనుమానం వ్యక్తం చేసిన భర్త.. బిడ్డ తనకు పుట్టలేదని అనడంతో ఆమె ఆగ్రహానికి గురైంది. నడిరోడ్డుపైనే భర్తను నిలదీసింది. 'నన్నే అనుమానిస్తావా' అంటూ బిగ్గరగా అరుస్తూ వీరంగం సృష్టించింది.

అంతేగాక, భర్త చేతుల్లోని నెల రోజుల చిన్నారిని లాక్కుని రోడ్డుపై పడేసింది. వెంటనే ఆమె బిడ్డను మళ్లీ తన ఒళ్లోకి చేర్చుకున్నాడు. ఆ తర్వాత భార్యపై చేయి చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
రోడ్డుపైనే దంపతులు గొడవపడుతుండటంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ గొడవను గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ గొడవ పడుతున్న భార్యాభర్తలకు సర్దిచెప్పి అక్కడ్నుంచి పంపించివేశాడు. కాగా, ఈ ఇద్దరు దంపతులు కూడా మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications