స్ట్రీట్‌ఫైటరా.. రియల్ ఫైటర్ కావాలా - ఈటల సంచలనం..!!
తెలంగాణలో బీజేపీ కీలక అడుగులు వేస్తోంది. తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు గెలుచుకుంది. వచ్చే స్థానిక సంస్థలు..అసెంబ్లీ ఎన్నికల కోసం కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల పై చర్చ జరుగుతోంది. ఇదే అంశం పైన బీజేపీ నేత రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేసారు. దీనికి ప్రతిస్పందనగా ఎంపీ ఈటల రాజేందర్ చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు పార్టీలో చర్చగా మారింది. ఈ అంశం పైన ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే దేశభక్తి, పార్టీ భక్తి, దైవభక్తి ఉన్నవాళ్లనే అధ్యక్షుడిగా నియమించాలన్న రాజాసింగ్ వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారితీసింది. ఇదే సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్ష రేసులో ఎంపీలు డీకే అరుణ, అరవింద్, రఘునందన్, ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో పాటు పార్టీ సీనియర్ నేతలు చింతల రాంచంద్రారెడ్డి, మురళీధర్ రావు, పేరాల చంద్రశేఖర్, ఆచారి లాంటివారి పేర్లు సైతం వినపడుతున్నాయి.

రాజాసింగ్ వ్యాఖ్యల పైన ఎంపీ ఈటల స్పందించారు. ఫైటర్ కావాలి.. స్ట్రీట్‌ఫైటరా.. రియల్ ఫైటరా.. ఐదుగురు ముఖ్యమంత్రులతో కొట్లాడా.. అంటూ మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తనదైన శైలిలో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధ్యక్షుడిగా ఫైటర్ కావాలంటున్నారన్న ఈటల.. ఎలాంటి ఫైటర్ కావాలని ప్రశ్నించారు. తాను ఐదుగురు ముఖ్యమంత్రులతో కొట్లాడానని తెలిపారు. సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలాన్ని కొట్టే దమ్మున్నోడు కావాలని.. గల్లీల్లో కొట్లాడేవాళ్లు కాదని అన్నారు. దీంతో..ఇప్పుడు తెలంగాణ బీజేపీ పగ్గాలు ఎవరికి చిక్కుతాయనేది రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.
-
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications