బతుకమ్మ సంబరాలకు 10కోట్లు: జిల్లాల షెడ్యూల్ ప్రకటించిన కవిత(పిక్చర్స్)
హైదరాబాద్: అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు తెలంగాణలో బతుకమ్మ సంబురాలు నిర్వహించనున్నట్లు టిఆర్ఎస్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇవి జరుగనున్నాయన్నారు.
బంగారు బతుకమ్మ గోడపత్రం, సీడీ, పాటల పుస్తకాలను కవిత గురువారం తెలంగాణ భవన్‌లో ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈ సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం వేడుకలకు రూ.10 కోట్లు కేటాయించనుందని తెలిపారు. దీనిలో పైసా కూడా దుర్వినియోగం కాబోదని, లెక్కలు కావాలంటే తెలంగాణ జాగృతి వెబ్‌సైట్‌లో చూడవచ్చన్నారు.
ఎనిమిదేళ్లుగా బతుకమ్మ వేడుకలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తమకెవరూ అండగా లేరని, జాగృతి మహిళలు ఒంటిపై నగలమ్ముకుని మరీ వేడుకలు నిర్వహించిన రోజులున్నాయని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఘనంగా పండుగ జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జాగృతికి 1.20 లక్షల మంది సభ్యులున్నారని, అనేక దేశాల్లోనూ కార్యకర్తలున్నారన్నారు.
ఈ యేడు తెలంగాణ జాగృతి వివిధ జిల్లాలలో నిర్వహించే బంగారు బతుకమ్మకు వేదికవుతున్న పట్టణాలను ఈ సందర్భంగా ప్రకటించారు.
ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
అక్టోబర్ 12 - నర్సంపేట, వరంగల్ జిల్లా
అక్టోబర్ 13 - హుస్నాబాద్, కరీంనగర్ జిల్లా
అక్టోబర్ 14 - కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా
అక్టోబర్ 15 - కౌడిపల్లి, మెదక్ జిల్లా
అక్టోబర్ 16 - వికారాబాద్, రంగారెడ్డి జిల్లా
అక్టోబర్ 17 - కొత్తకోట, మహబూబ్ నగర్ జిల్లా
అక్టోబర్ 18 - ముంబై, మహారాష్ట్ర
అక్టోబర్ 19 - దేవరకొండ, నల్గొండ జిల్లాలో నిర్వహించనున్నారు.

ఎంపి కవిత
అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు తెలంగాణలో బతుకమ్మ సంబురాలు నిర్వహించనున్నట్లు టిఆర్ఎస్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇవి జరుగనున్నాయన్నారు.

ఎంపి కవిత
బంగారు బతుకమ్మ గోడపత్రం, సీడీ, పాటల పుస్తకాలను కవిత గురువారం తెలంగాణ భవన్‌లో ఆవిష్కరించారు.

ఎంపి కవిత
అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈ సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం వేడుకలకు రూ.10 కోట్లు కేటాయించనుందని తెలిపారు.

ఎంపి కవిత
దీనిలో పైసా కూడా దుర్వినియోగం కాబోదని, లెక్కలు కావాలంటే తెలంగాణ జాగృతి వెబ్‌సైట్‌లో చూడవచ్చన్నారు.

ఎంపి కవిత
ఎనిమిదేళ్లుగా బతుకమ్మ వేడుకలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.












Click it and Unblock the Notifications