Raghunandan Rao: నిందితులందరూ ఆయనే పేరే చెబుతున్నారు.. రఘునందన్ రావు..
మెదక్ ఎంపీ రఘునందన్ రావు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. త్వరలోనే కేసీఆర్ ఇంటికి ఈడీ వస్తుందన్నారు. గతం ప్రభుత్వం హయాంలో తెలంగాణలో గొర్రెల కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన అధికారులంతా కేసీఆర్ పేరే చెబుతున్నారని ఆయన తెలిపారు. అన్ని వేళ్లు కేసీఆర్ వైపే చూపిస్తున్నాయని.. ఈడీ రాక తప్పదని చెప్పారు. గులాబీ పార్టీ మునిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో కలిసిపోతుందన్నారు.
గులాబీ పార్టీకి సీఆర్ఎస్(కంపల్‌సరీ రిటైర్మెంట్ స్కీం) అవసరమన్నారు. హరీశ్ రావు, కేసీఆర్ ఎవరు బీజేపీలోకి వచ్చిన స్వాగతిస్తామని పేర్కొన్నారు. పార్టీ కండువా కప్పుకున్న రోజు నుంచే పార్టీ ఆదేశాల ప్రకారమే పని చేస్తున్నట్లు వివరించారు. కొత్త నేతలు వచ్చినా పదవి రాదనే అపోహ వద్దన్నారు. అలా అయితే హిమంత బిశ్వశర్మకు అస్సాం ముఖ్యమంత్రి అయ్యేవారు కాదని చెప్పారు. బీజేపీలో పని చేసిన వారికి తప్పుకుండా గుర్తింపు ఉంటుందన్నారు. కార్పొరేటర్ స్థాయి నుంచి వచ్చిన బండి సంజయ్ కేంద్ర మంత్రి అయ్యారని రఘునందన్ రావు గుర్తు చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియమాకంపై రఘునందన్ రావు మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా తమ అభిప్రాయాలు తెలపొచ్చని.. రాజాసింగ్ తన అభిప్రాయం వెల్లడించారని తెలిపారు. నీట్ పరీక్షపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. తనను గెలిపించిన మెదక్ ను అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తామని రఘునందన్ రావు చెప్పారు. దళితుల భూములు వారికి అప్పగించేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.
ఐటీఐఆర్ ప్రాజెక్టు గైడ్ లైన్స్ అన్ని అమలు చేసినట్లు.. ఈ ప్రాజెక్టు టెక్నికల్ గా మాత్రమే రద్దు అయిందని పేర్కొన్నారు. మెదక్ కు ఇందిరమ్మ రాకముందే బీహెచ్ఈఎల్, ఇక్రిశాట్ వచ్చాయన్నారు. తనపై పోటీ చేసిన వెంకట్రామిరెడ్డి లక్షల కోట్లు సంపాదించాడని ఆరోపించారు. ప్రజల బలం ముందు ధన బలం పనిచేయదన్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications