వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Munugodu bypoll: వెలువడుతున్న ఫలితాలు, హోరాహోరీగా బీజేపీ, టీఆర్ఎస్

|
Google Oneindia TeluguNews

మునుగోడు: కాంగ్రెస్‌లో ఇమడలేక ఆ పార్టీకి మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరినప్పటి నుంచే మునుగోడులో పొలిటికల్ హీట్ పెరిగింది. ఇక ప్రచారం కూడా రెండు నెలల పాటు వేడెక్కింది. ఉపఎన్నిక నవంబర్ 3వ తేదీన జరిగింది. పోటీ టీఆర్ఎస్ బీజేపీ మధ్యే ప్రధానంగా జరిగినట్లు కనిపించింది.

90శాతంకు పైగా పోలింగ్ నమోదు కావడంతో ఈ ఉపఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఫలితాలు నవంబర్ 6వ తేదీ వెలువడతాయి. ఇందుకోసం ఈసీ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. మొత్తం 15 రౌండ్లు పాటు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. తొలి ఫలితం ఉదయం 9 గంటలకు వెలువడే అవకాశాలున్నాయి. కౌంటింగ్ కోసం ప్రతి పార్టీ నుంచి 21 మంది కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకునేందుకు ఈసీ అనుమతించింది. ఇక మునుగోడు ఫలితాలపై మినిట్‌-టూ-మినిట్ అప్‌డేట్స్ మీకోసం..

Munugode bypoll result live updates in telugu:will Bjps Komatireddy rajagopal pull off

Newest First Oldest First
5:26 PM, 6 Nov

11,666 ఓట్లతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు
5:26 PM, 6 Nov

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం
5:25 PM, 6 Nov

14వ రౌండ్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం, 10,094 ఓట్ల లీడ్
4:17 PM, 6 Nov

13వ రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యతను కొనసాగించింది.
4:02 PM, 6 Nov

టీఆర్ఎస్ ప్రజలను బెదిరించి, ప్రలోభపెట్టి అధర్మంగా గెలుస్తోందని మండిపడ్డారు రాజగోపాల్.
3:56 PM, 6 Nov

ఏది ఏమైనా ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
3:54 PM, 6 Nov

అధికార దుర్వినియోగం, డబ్బు, మద్యం పంచి టీఆర్ఎస్ అధర్మంగా గెలిచిందని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.
3:53 PM, 6 Nov

మునుగోడులో బీజేపీ నైతిక విజయం సాధించిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
3:51 PM, 6 Nov

7836 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు.
3:49 PM, 6 Nov

12వ రౌండ్ లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం
3:29 PM, 6 Nov

11వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ అభ్యర్థికి 5794 ఓట్ల ఆధిక్యం లభించింది.
3:22 PM, 6 Nov

మునుగోడులో 11వ రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యత సాధించారు.
3:18 PM, 6 Nov

మహారాష్ట్ర: ఈ విజయం నా భర్తది, అంధేరిలో ఆయన చేసిన అభివృద్ధి పనులది. ఆశీర్వాదం కోసం నేను ఇప్పుడు ఎన్నికల కేంద్రానికి, ఆ తర్వాత మాతోశ్రీ వద్దకు వెళ్తాను అని అంధేరీ తుర్పూ ఎన్నికల్లో 66,530 ఓట్లతో ఆధిక్యంలో ఉన్న ఉద్ధవ్ థాక్రే శివసేన అభ్యర్థి రుతుజా లట్కే తెలిపారు.
3:08 PM, 6 Nov

11వ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి 5774 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు
3:07 PM, 6 Nov

11వ రౌండ్‌లోనూ టీఆర్ఎస్ ఆధిక్యత.
3:06 PM, 6 Nov

10వ రౌండ్‌లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యత కనబర్చడంతో తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
2:58 PM, 6 Nov

బీహార్‌లోని గోపాల్‌గంజ్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి కుసుమ్ దేవి 1,794 ఓట్ల తేడాతో గెలుపొందారు.
2:57 PM, 6 Nov

హర్యానాలో అడంపూర్ ఉపఎన్నికలో బిజెపి అభ్యర్థి భవ్య బిష్ణోయ్ 15,740 ఓట్ల తేడాతో గెలుపొందారు.
2:56 PM, 6 Nov

బీహార్: మొకామా ఉప ఎన్నికలో ఆర్జేడీ అభ్యర్థి నీలం దేవి 16,741 ఓట్ల తేడాతో గెలుపొందారు.
2:54 PM, 6 Nov

10వ రౌండ్లో ముగిసే సరికి 4416 టీఆర్ఎస్ అధిక్యతను చాటుకుంది.
2:53 PM, 6 Nov

10వ రౌండ్లో.. టీఆర్ఎస్ అభ్యర్థికి 7499 బీజేపీ అభ్యర్థికి 7015 ఓట్లు వచ్చాయి.
2:51 PM, 6 Nov

10వ రౌండ్‌లోనూ టీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యత
2:34 PM, 6 Nov

9వ రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థికి 4వేల ఓట్ల ఆధిక్యత
2:31 PM, 6 Nov

9వ రౌండ్లో టీఆర్ఎస్ కు 7497 బీజేపీకి 6665 ఓట్లు వచ్చాయి.
2:24 PM, 6 Nov

9వ రౌండ్‌లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం
2:12 PM, 6 Nov

అభ్యర్థులకు వచ్చిన ఓట్లు: రాజగోపాల్ రెడ్డి: 52,347 ప్రభాకర్ రెడ్డి: 49,247 పాల్వాయి స్రవంతి: 13,689
2:07 PM, 6 Nov

8వ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 536 ఆధిక్యత వచ్చింది
2:06 PM, 6 Nov

8వ రౌండ్ తర్వాత 3వేలకు చేరిన టీఆర్ఎస్ ఆధిక్యత
2:02 PM, 6 Nov

8వ రౌండ్‌లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యం సాధించారు.
1:36 PM, 6 Nov

ఏడో రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ అభ్యర్థికి 45,710 బీజేపీ అభ్యర్థికి 43,155 కాంగ్రెస్ అభ్యర్థికి 12,025 ఓట్లు వచ్చాయి.
READ MORE

English summary
Munugodu bypoll results live updates in telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X