కెసిఆర్‌పై సినిమా అందుకే చేస్తున్నా: రామ్ గోపాల్ వర్మ

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె. చంద్రశేఖర రావుపై సినిమా తీసే విషయంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో ప్రకటన చేశారు. కెసిఆర్ బయోపిక్ తీస్తున్నామంటూ దర్శకుడు మధుర శ్రీధర్ ప్రకటించిన 24 గంటల లోపలే తాను కూడా కెసిఆర్ కథతో సినిమా తీస్తానంటూ ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే.

తాను సినిమా తీస్తానంటూ ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ ఆ సినిమా పేరు కూడా ప్రకటించారు. ఆర్‌సికె ఆ సినిమా పేరంటూ ప్రకటించేశారు. ఆ ప్రకటన చేసిన మరో 24 గంటల తర్వాత కెసిఆర్‌పై తాను ఎందుకు సినిమా చేయదలుచుకున్నాడో కూడా చెప్పారు.

My film on KCR will be derived from extensive discussions with KTR: RGV

కెసిఆర్ తనయుడు కెటి రామారావును కలిసిన సందర్బంలో ఆయనతో సుదీర్ఘంగా చర్చలు సాగాయని, ఆయనతో చర్చలు చేస్తున్న క్రమంలోనే కెసిఆర్‌పై సినిమా చేయాలనే ఆలోచన వచ్చిందని రామ్ గోపాల్ వర్మ చెప్పాడు.

నిజంగానే రామ్ గోపాల్ వర్మ కెసిఆర్ బయోపిక్‌ను నిర్మిస్తారా, లేదా చూడాల్సిందే. నిర్మిస్తే అది ఎలా ఉంటుందనేది కూడా ఆసక్తికరమైన విషయమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+