హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పక్కా ప్లాన్‌తోనే న్యాయవాదిని హత్య చేశారు: నిందితులు వీరే(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కీసర ప్రాంతంలో ఆవుల ఉదయ్‌కుమార్‌(47 అనే న్యాయవాదిని దుండగులు దారుణంగా హత్య చేసి కారులో దహనం చేసిన కేసును సైబరాబాద్‌ పోలీసులు ఇరవై నాలుగు గంటల్లోనే ఛేదించారు. గత శనివారం అర్ధరాత్రి న్యాయవాది ఉదయ్‌కుమార్ తన కారుతోపాటు సజీవంగా దహనమైన విషయం తెలిసిందే. కారు నెంబర్ ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు హత్యకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.

సోమవారం కీసర పోలీస్‌ స్టేషన్‌లో మల్కాజిగిరి డీసీపీ రాంచంద్రారెడ్డి, అల్వాల్‌ ఏసీపీ సయ్యద్‌ రఫిక్‌, కీసర సీఐ పన్నాల గురువారెడ్డిలు న్యాయవాది ఉదయ్‌ హత్య కేసు వివరాలను మీడియాకు వెల్లడిచారు. ఉదయ్ కుమార్‌యాదవ్‌ తండ్రి నకులుడు మాజీ సైనికుడు. సైనిక్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ద్వారా 1975లో శామీర్‌పేట మండలం జవహర్‌నగర్‌ చెన్నాపూర్‌లో 5 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది.

కాగా, ఆ స్థలానికి సంబంధించి గత కొన్నాళ్లుగా సైనిక్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌కు ప్రభుత్వానికి మధ్య న్యాయస్థానంలో వివాదం కొనసాగుతోంది. దీంతో మాజీ సైనికుడైన నకులుడుకి ప్రభుత్వం ఎలాంటి పట్టా ఇవ్వలేదు. స్థలం ఉపయోగకరంగా లేకపోవడంతో ఆంజనేయులు అనే వ్యక్తికి లీజుకు ఇచ్చారు. ఆ తర్వాత 2016 ఏప్రిల్‌లో రూ.25 లక్షలకు నోటరీ ద్వారా ఆ స్థలాన్ని విక్రయించారు.

అయితే, తనకు తెలియకుండా స్థలాన్ని ఎందుకు అమ్మావంటూ ఉదయ్‌కుమార్‌ తండ్రిని నిలదీశాడు. న్యాయవాది అయిన ఉదయ్‌కుమార్‌ స్థలం కొనుగోలు చేసినవారి వద్దకు వెళ్లి.. మాజీ సైనికులకు ప్రభుత్వం ఇచ్చిన స్థలం ఎలా కొనుగోలు చేశారని ప్రశ్నించారు. చట్ట రీత్యా ఈ విక్రయం చెల్లదని, తిరిగి ఇవ్వాల్సిందేనని ఒత్తిడి చేశాడు.

ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతంలో ఉదయ్‌కుమార్‌ తన మారుతి కారులో వ్యవసాయ భూమి వద్దకు వెళ్లారు. అక్కడున్న ఆంజనేయులు అల్లుడు డొప్పలపుడి లోకేష్‌బాబుతో గొడవపడ్డాడు. దీంతో ఉదయ్‌కుమార్‌ను కత్తితో మెడపై పొడిచాడు లోకేష్. హత్య చేసిన తర్వాత లోకేష్‌బాబుకు ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే తన స్నేహితుడు సుమన్‌రెడ్డికి ఫోన్‌ చేసి పిలిపించుకున్నాడు.

ఇద్దరు కలిసి ఉదయ్‌కుమార్‌ కారులోనే వెనకాల సీటులో మృతదేహాన్ని పడేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి సుమన్‌రెడ్డి వెళ్లి పోయాడు. లోకేష్‌ ద్విచక్ర వాహనంపై పెట్రోల్‌ బంకు వద్దకు వెళ్లి 5లీటర్ల పెట్రోలు కొనుగోలు చేసి తీసుకొచ్చాడు. తర్వాత కారును గుర్తుపట్టకుండా ఉండేందుకు కారుకు ఓ పక్క ఉన్న నెంబరు ప్లేట్లు ఊడదీసి పక్కన పడేశాడు.

శనివారం సాయంత్రం చీకటి పడ్డాక.. అదే కారులో కీసరదాయర సమీపంలోని నిర్జన ప్రదేశానికి వచ్చాడు. అక్కడ పెట్రోలును కారుపై పోసి నిప్పంటించాడు. ఆ సమయంలో లోకేష్‌ చేతులు, ఛాతీ భాగంలో మంటలు అంటుకున్నాయి. మంటలకు తాళలేక రోడ్డు పక్కనున్న తొట్టిలోని నీటితో కడుక్కొని అక్కడి నుంచి మరో వాహనంలో వెళ్లి పోయాడు. ఇదంతా గమనిస్తే పక్కా ప్లాన్ ప్రకారమే న్యాయవాది హత్య చేసినట్లు అర్ధమవుతోంది.

దగ్ధమైన కారు

దగ్ధమైన కారు

రంగారెడ్డి జిల్లా కీసర ప్రాంతంలో ఆవుల ఉదయ్‌కుమార్‌(47 అనే న్యాయవాదిని దుండగులు దారుణంగా హత్య చేసి కారులో దహనం చేసిన కేసును సైబరాబాద్‌ పోలీసులు ఇరవై నాలుగు గంటల్లోనే ఛేదించారు.

కారులోనే సజీవ దహనం

కారులోనే సజీవ దహనం

గత శనివారం అర్ధరాత్రి న్యాయవాది ఉదయ్‌కుమార్ తన కారుతోపాటు సజీవంగా దహనమైన విషయం తెలిసిందే.

ఉదయ్ కుమార్ హత్య కేసు

ఉదయ్ కుమార్ హత్య కేసు

కారు నెంబర్ ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు హత్యకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.

మీడియాకు వివరాలు

మీడియాకు వివరాలు

రెండు నెలలుగా ఉదయ్‌కుమార్, లోకేశ్ మధ్య వివాదం కొనసాగుతోందని, కారులో వున్న ఉదయ్‌కుమార్‌ను హత్య చేసి నిప్పంటించే సమయంలో నిందితుడు లోకేశ్‌కు గాయాలయ్యాయని మల్కాజ్‌గిరి జోన్ ఇన్‌చార్జి డిసిపి రామచంద్రారెడ్డి తెలిపారు.

నిందితుడు లోకేష్

నిందితుడు లోకేష్

సోమవారం కీసర పోలీస్‌ స్టేషన్‌లో మల్కాజిగిరి డీసీపీ రాంచంద్రారెడ్డి, అల్వాల్‌ ఏసీపీ సయ్యద్‌ రఫిక్‌, కీసర సీఐ పన్నాల గురువారెడ్డిలు న్యాయవాది ఉదయ్‌ హత్య కేసు వివరాలను మీడియాకు వెల్లడిచారు.

సుమన్ రెడ్డి

సుమన్ రెడ్డి

న్యాయవాది ఉదయ్ కుమార్ హత్యకు సహకరించిన సుమన్ రెడ్డి

 రోధిస్తున్న కుటుంబసభ్యులు

రోధిస్తున్న కుటుంబసభ్యులు

న్యాయవాది ఉదయ్ కుమార్ హత్యకు గురికావడంతో ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

English summary
The mystery behind the unidentified burnt body found on Sunday in Keesara was solved on Monday, as the corpse was positively identified as that of 47-year-old Uday Kumar, a city-based lawyer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X