రూ. 26 వేలకే కారు.. క్యూ కట్టిన జనాలు.. వ్యాపారి ఏం చేశాడంటే..?
కారు కొనుగోలు చేయాలని ప్రతి మధ్య తరగతి ఫ్యామిలీకి ఓ డ్రీమ్ గా ఉంటుంది. ఇటీవలి కాలంలో ప్రతి ఇంట్లో కారు అనేది కామన్ అయిపోయింది. చిన్నదైనా పెద్దదైనా ఓ కారు ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. అయితే తాజాగా ఓ వ్యాపారి రూ. 26 వేలకే కారు అమ్మకం అని ప్రచారం చేశాడు. ఈ మేరకు ఇన్ స్టా గ్రామ్ లో ప్రకటన చేశాడు. ఆ వ్యాపారి ప్రకటన చూసిన స్థానికులు పెద్ద ఎత్తున అతడి షాపు వద్దకు వచ్చారు. దీంతో ఆ వ్యాపారి చేతులెత్తేశాడు. దాంతో ఆగ్రహించిన స్థానికులు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వ్యాపారిపై కేసు నమోదైంది.
జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా రూ.26 వేలకే కారు అమ్ముతామని ప్రకటించాడు ఓ కార్ల వ్యాపారి. ఈ ఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మల్లాపూర్ కు చెందిన రోషన్ అనే వ్యాపారి గణతంత్ర దినోత్సవం సందర్భంగా రూ. 26 వేలకే కార్లను విక్రయిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టాడు. తన వద్ద ఉన్న 50 కార్లను ఇదే ధరకు విక్రయిస్తున్నట్లు తెలిపాడు.
ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో రోషన్ కార్ల షాపు వద్దకు వచ్చారు. కొంతమంది దూర ప్రాంతాల నుంచి కూడా తరలివచ్చారు. అయితే అక్కడ కేవలం 10 కార్లు మాత్రమే ఉన్నాయి. జనాలు మాత్రం చాలా మంది వచ్చారు. దీంతో రోషన్ చేతులెత్తేశాడు. అలా వ్యాపారి చాలాసేపటి వరకు రాకపోవడంతో జనాలు ఆగ్రహానికి గురయ్యారు. షాపులో ఉన్న కార్లపై రాళ్లు రువ్వి దాడి చేశారు. అనంతరం పోలీసులు అక్కడకు చేరుకుని వ్యాపారిపై కేసు నమోదు చేసి నాచారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఇలాంటి మోసపూరిత ప్రకటనలు సామాజిక మాధ్యమాల్లో అనేకం వస్తుంటాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. వాటిలో నిజమెంతో తెలియకుండా ఇబ్బందులు పడొద్దని పోలీసులు సూచించారు. అలాగే సైబర్ నేరగాళ్ల మాయ మాటలను నమ్మి మోసపోవద్దని సూచనలు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ జరుగుతోంది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications