Niharika konidela:విడాకులపై మెగా డాటర్ స్పందన..అది కావాలంటూ రిక్వెస్ట్..!

మెగా డాటర్ నిహారిక కొణిదెల చైతన్యలకు కోర్టు విడాకులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మీడియా మొత్తం ఈ కపుల్ డివోర్స్ మీదనే ఫోకస్ చేసింది. వాస్తవంగా వీరిద్దరూ కూకట్‌పల్లిలోని ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకోగా గతనెలలో వీరికి విడాకులు మంజూరయ్యాయి. అయితే ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Niharika

తాజాగా విడాకుల ఎపిసోడ్ పై నిహారికా స్పందించారు. భర్త చైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఈ సమయం ఇద్దరికీ చాలా కీలకమని చెప్పిన నిహారికా తమను ఇబ్బంది పెట్టొద్దంటూ ఇన్స్‌టాగ్రామ్ వేదికగా పోస్టు చేశారు. ఇక నుంచి కొత్తగా తమ జీవితాలను ప్రారంభించబోతున్నామని చెప్పిన నిహారిక తమ వ్యక్తిగత జీవితంలో ప్రైవసీ కోరుకుంటున్నట్లు పేర్కొంది.దీన్ని అందరూ గౌరవించాలని విజ్ఞప్తి చేసింది.ఈ కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన కుటుంబం, సన్నిహితులకు నిహారిక థ్యాంక్స్ చెప్పుకొచ్చింది.

 Niharika konidela

నిహారిక భర్తతో విడిపోయిందంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. అంతేకాదు తన అన్న వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల ఎంగేజ్‌మెంట్‌ ఫంక్షన్‌లో నిహారిక చైతన్యతో కనిపించకపోవడంతో ఈ ప్రచారానికి మరింత బలంచేకూరింది. ఇక ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ నుంచి ఇద్దరూ ఫోటోలను డిలీట్ కూడా చేశారు. అప్పుడే వీరిద్దరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయనే టాక్ ఫిలింనగర్‌లో నడిచింది.

 Niharika konidela:

ఇక నిహారిక విడాకులు కోరుతూ కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో 1 ఏప్రిల్ 2023న దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈమె తరపున జనసేన పార్టీ సానుభూతిపరుడు అడ్వకేట్ కల్యాణ్ దిలీప్ సుంకర వాదనలు వినిపించారు. మే 29న వాదనలు జరుగగా ఇరువురి అభీష్టంమేరకు విడాకులు మంజూరు చేస్తున్నట్లు ఫ్యామిలీ కోర్టు జూన్ 5వ తేదీన ఆర్డర్స్ పాస్ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+