కాంగ్రెస్‌కు భారీ షాక్: నాగం జనార్ధన్ రెడ్డి రాజీనామా, బీఆర్ఎస్‌లోకే

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. నాగర్‌కర్నూల్ కంగ్రెస్ టికెట్ ఆశించినా దక్కకపోవడంతో నాగం ఆ పార్టీపై అసంతృప్తి ఉన్నారు. కొద్ది రోజులుగా పార్టీ నాయకత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహంగా నాగం.. తాజాగా, ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ క్రమంలో తన అనుచరులతో చర్చల అనంతరం తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. కాగా, త్వరలోనే నాగం జనార్ధన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు.

Nagam Janardhan reddy resigned for Congress: will join BRS soon

అయితే, కాంగ్రెస్ పార్టీకి నాగం రాజీనామా చేయడం కొంత ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. నాగం బీఆర్ఎస్ పార్టీలో చేరితే ఆ పార్టీకి కొంత బలం చేకూరినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో నాగర్ కర్నూల్ స్థానంలో బీఆర్ఎస్ గెలుపులో నాగం కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

కాగా, ఇటీవలే పార్టీలో చేరిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కుమారుడు రాజేష్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ టికెట్ ఖరారు చేశారు. అయితే, తనకు పార్టీ టికెట్ ఇవ్వకపోవడానికి కారణం కూడా చెప్పలేదని నాగం అసహనం వ్యక్తం చేశారు. 2018 నుంచి నాగర్ కర్నూల్ లో పార్టీ బలోపేతం కోసం అన్ని కార్యక్రమాలు చేపట్టానని, కానీ, బీఆర్ఎస్‌లో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న దామోదర్ రెడ్డి కుమారుడికి పార్టీ టికెట్ ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. బోగస్ సర్వేల పేరుతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనను మోసం చేశారని నాగం మండిపడ్డారు.

ఇది ఇలావుండగా, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌ కూడా కాంగ్రెస్‌ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యమ కాలం నుంచి సీఎం కేసీఆర్‌తో తనకు గొప్ప అనుబంధం ఉందని చెప్పారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+