ఉద్యమ వేదిక.. బచావో తెలంగాణ: కెసిఆర్‌కు నాగం ఝలక్, బిజెపికీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ప్రకటన వచ్చే వరకు ప్రత్యేక రాష్ట్రం ఉద్యమాలతో దద్దరిల్లిన తెలంగాణ... ఇక సుపరిపాలన, అభివృద్ధి కోసం 'బచావో తెలంగాణ' ఉద్యమాలతో వేడెక్కనుందా? అంటే అవుననే చెబుతున్నారు!
తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమ వేదిక రూపుదిద్దుకుంటోంది. మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తదితరుల నేతృత్వంలో రాజకీయాలకు అతీతంగా తెలంగాణ సమస్యల పైన పోరాటానికి తెలంగాణ బచావో ఏర్పాటు చేస్తున్నారు.
ఈ నెల 19వ తేదీన హైదరాబాద్ బషీర్ బాగ్ నుంచి కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. కొత్తగా ఏర్పడే సంస్థకు బచావో తెలంగాణ అని పేరు పెట్టారు. ప్రస్తుతానికి ఇది రాజకీయేతర పక్షాల వేదికగా ఏర్పాటు చేస్తున్నారు. భవిష్యత్తులో రాజకీయ రూపం సంతరించుకునే అవకాశం ఉంది.

కాంగ్రెస్, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలతో పాటు గతంలో ఏర్పడ్డ అనేక తెలంగాణ ఉద్యమ సంస్థలలో పని చేసిన వారు కూడా బచావో తెలంగాణలోకి వస్తారని భావిస్తున్నారని తెలుస్తోంది. కరువు, నిరుద్యోగం, ప్రాజెక్టులు, ఇళ్ల నిర్మాణం, ఉద్యోగ, కార్మిక సంఘాల సమస్యలపై 19న కార్యాచరణ ప్రకటించనున్నారు.
వేదికకు సంబంధించి జిల్లాల వారీగా కూడా కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. బిజెపిలో ఉంటూనే వీరు బచావో తెలంగాణ పేరుతొ సొంత పోరు చేయనున్నారని తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయాల పైన ఇక పోరుకు వారు కార్యాచరణ సిద్ధం చేయనున్నారు.
ప్రజలు కోరుకున్న తెలంగాణ వచ్చినప్పటికీ... ఆ స్థాయిలో అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు ఏవీ ఉండటం లేదని విపక్షాలు భావిస్తున్నాయి. ఈ సమయంలో నాగం, యెన్నంలు బచావో తెలంగాణ పేరుతో ముందుకు వస్తున్నారు. ఇది కెసిఆర్‌కు పెద్ద షాక్ అని అంటున్నారు. అదే సమయంలో బిజెపికి కూడా షాకనే చెప్పవచ్చు.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..












Click it and Unblock the Notifications