నేను అలాంటోడినే..నాగార్జున సంచలన కామెంట్స్
అక్కినేని నాగ చైతన్య - సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ హాట్ కామెంట్స్ చేశారు. నాగ చైతన్య - సమంత విడాకులకు మాజీ మంత్రి కేటీఆరే అని కొండా సురేఖ చెప్పుకొచ్చారు. ఎన్ కన్వెషన్ హాల్‌ను కాపాడుకోవాలంటే సమంతను తన దగ్గరకు పంపించాలంటూ కేటీఆర్ కండిషన్ పెట్టారని, అది నచ్చని సమంత, నాగ చైతన్యకు విడాకులు ఇచ్చారని చెప్పి కొండా సురేఖ సంచలన కామెంట్స్ చేశారు. ఆమె అక్కడితో ఆగకుండా తన వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతూనే , మరోవైపు సమర్ధించుకున్నారు.
వాళ్ల విడాకులపై నేను చేసిన వ్యాఖ్యలు తప్పే కావచ్చు. మరి వారి విడాకులకు కారణం ఏంటో ఇంతవరకు ఎందుకు బయటకు చెప్పలేదు. నాగార్జున ఫ్యామిలీ నుంచి కానీ, సమంత నుంచి ఎవరూ రీజన్ ఏంటో చెప్పలేదు. తమకు ఇండస్ట్రీ నుంచి ఇంటర్నల్‌గా వచ్చిన సమాచారాన్నే నేను చెప్పాను. ఆ మాటలు కూడా నేను కోపంలో అన్నాను. నేను వాస్తవాలే మాట్లాడుతా. లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఇంకోటి మాట్లాడటం నాకు రాదంటూ ఆమె కామెంట్స్ చేశారు. అయితే అక్కినేని ఫ్యామిలీపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.

ఈ వివాదంపై సినీ, రాజకీయ ప్రముఖులు రియాక్ట్ అవుతున్నారు. సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా అక్కినేని ఫ్యామిలీకి అండగా నిలిచింది. చిరంజీవి, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాజమౌళి మొదలగు సినీ ప్రముఖలు నాగ చైతన్య - సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. నాగార్జున తాజాగా ఓ మీడియా ఛానెల్‌లో మాట్లాడుతూ..నా కుటుంబాన్ని కాపాడుకునే విషయంలో తాను బలమైన వ్యక్తినేనని చెప్పుకొచ్చారు.
అవసరం అయితే నా కుటుంబానికి అండగా నిలుస్తూ నేను సింహాన్ని కూడా అవుతానంటూ ఆయన తెలిపారు. క్లిష్ట సమయంలో మాకు తెలుగు సినీ మొత్తం అండగా నిలబడింది. ఇదంతా మా నాన్న అక్కినేని నాగేశ్వర రావు గారి ఆశీర్వాదంగా భావిస్తున్నానని నాగార్జున పేర్కొన్నారు.ఇదిలా ఉండగా.. మంత్రి కొండా సురేఖ తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ నాగార్జున పిటిషన్ దాఖలు చేయగా, నాంపల్లి కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications