మగాళ్లపై వ్యాఖ్య: నన్నపనేనికి భార్యా బాధితుల సంఘం చీఫ్ కౌంటర్
సినీ నటుడు చలపతి రావు వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆయన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి బుధవారం మండిపడ్డారు.
హైదరాబాద్: సినీ నటుడు చలపతి రావు వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆయన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి బుధవారం మండిపడ్డారు.
అయితే ఆమె వ్యాఖ్యలపై తెలంగాణ భార్యాబాధితుల సంఘం అధ్యక్షులు స్పందించారు. ఎవరో ఒకరిద్దరు తప్పు చేస్తే మగాళ్లందరిపై వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు మీ ఇంట్లోని మగవారిపై ఆ ప్రయోగం చేయాలని ఆయన అన్నారు. ఎవరో ఒకరు చేసిన తప్పుకు అందరినీ అనవద్దన్నారు.

కాగా, రక్షణ కోసం మహిళలు, చాకులు, కత్తులు తమ వెంట తీసుకు వెళ్లాలని, మానవ మృగాలు దాడి చేస్తే వారి మర్మాంగాలు కోసేయాలని నన్నపనేని రాజకుమారి అన్నారు.
ఇందుకోసం ప్రత్యేకంగా చట్టం తీసుకు వచ్చే ఆలోచన చేస్తున్నట్లు నన్నపనేని చెప్పారు. ఆమె కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న రేప్ బాధితురాలిని పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
ఘటన చాలా బాధాకరమని, బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు. అత్యాచార బాధితులను చూసి ఆమె కంటతడి పెట్టారు. మానవ మృగాల్లా ఎవరైనా మీద పడితే మర్మాంగాలు కోసేయాలన్నారు.












Click it and Unblock the Notifications