శోభనం రాత్రే వరుడి ఆత్మహత్య -మేనమామ కూతురుతో ఇటీవలే పెళ్లి -నల్గొండ జిల్లాలో విషాదం

కొత్త ఏడాది తొలివారంలోనే పెళ్లి చేసుకుని.. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ఆరంభించిన ఓ యువకుడు అనూహ్య రీతిలో శోభనం రాత్రి నాడే తనువు చాలించాడు. ఇంట్లో శోభనానికి ఏర్పాట్లు జరుగుతుండగా.. ఇప్పుడే వస్తానంటూ బయటికెళ్లిన అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు. నల్గొండ జిల్లాలో విషాదం నిందిపన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి..

మేనమామ కూతురితో పెళ్లి..

మేనమామ కూతురితో పెళ్లి..

నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం మనిమద్దె గ్రామానికి చెందిన గోళ్ల అంతమ్మ చిన్న కుమారుడు సోమేశ్‌ అలియాస్‌ సోమయ్య (27)కు ఈనెల 3న నాగారం మండలం ఫణిగిరికి చెందిన మేనమామ కూతురుతో వివాహమైంది. సంప్రదాయం ప్రకారం 11వ రోజైన మంగళవారం రాత్రి శోభనానికి ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే స్నేహితులను కలిసేందుకు బయటకు వెళ్లిన సోమేశ్ ఎంతసేపటికీ తిరిగిరాలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు.

రాత్రంతా గాలించినా..

రాత్రంతా గాలించినా..

ఫస్ట్ నైట్ ముహుర్తం తెలిసి కూడా రాత్రయినా ఇంటికి రాకపోవడంతో సోమేశ్ కుటుంబీకులు, స్నేహితులు ఆందోళనతో గాలింపు ప్రారంభించారు. స్నేహితులంతా ఎవరింటికి వారు వెళ్లిపోగా..సోమేశ్ కూడా ఇంటికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరాడు. కానీ, అతను ఇల్లు చేరలేదు. సోమేశ్ కనిపించడం లేదన్న సమాచారం ఊరిలో ఆంధోళన రేకెత్తించింది.. తీరా..

పాడుబడ్డ గుడిసెలో వేలాడుతూ..

పాడుబడ్డ గుడిసెలో వేలాడుతూ..

రాత్రాంతా గాలించినా సోమేశ్ ఇంటికి రాకపోవడంతో ఆందోళన పడిన కుటుంబసభ్యులు తెల్లవారుజామున అతడి స్నేహితుల ఇంటికి వెళ్లి వాకబు చేయగా తమ ముందే ఇంటికి బయలుదేరాడని చెప్పారు. దీంతో వారు గ్రామంలో గాలించగా.. ఊళ్లోని ఓ పాత పూరింట్లో దూలానికి ఉరి వేసుకుని విగత జీవిగా సోమేశ్ కనిపించాడు. మృతుడి తల్లి అంతమ్మ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శోభనం రోజు రాత్రే వరుడు ఆత్మహత్య చేసుకోవడంతో వధువుతో పాటు బంధువులు, స్థానికులు విషాదంలో మునిగిపోయారు. సోమేశ్ మరణానికి దారితీసిన కారణాలు తెలియాల్సిఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+