టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు: 6 కేసులు కొట్టివేత; తరుణ్, పూరీకి భారీ ఊరట
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. 2018లో నమోదైన కేసులను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. తెలుగు సినీ పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. మొత్తం 12 కేసులు నమోదు చేసి సిట్.. ఎనిమిది కేసుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
వీటిలో ఆరు కేసులకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడంతో నాంపల్లి కోర్టు కొట్టివేసింది. డ్రగ్స్ కేసులో పాటించాల్సిన ప్రొసీజర్ పాటించలేదని, ఆరు కేసుల్లో ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాలు లేవని కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా, ఈ కేసులకు సంబంధించి నెలల తరబడి టాలీవుడ్ నటులను ఎక్సైజ్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. వారి మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు.

నటీనటుల దగ్గర నుంచి గోళ్లు, వెంట్రుకల నమూనాలు తీసుకుని ఎఫ్ఎస్ఎల్‌కు పంపించారు. వాటిలో సినీ ప్రముఖులు పూరి జగన్నాథ్, తరుణ్ శాంపిల్స్ మాత్రమే పరిశీలించిన ఎఫ్ఎస్ఎల్.. వారి శరీరాల్లో ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్లు లభించలేదని తేల్చింది. ఈ నివేదిక ఆధారంగా సాక్ష్యాలను పరిశీలించిన నాంపల్లి కోర్టు 6 కేసులను కొట్టివేస్తూ గురువారం తీర్పు వెలురించింది.
ప్రస్తుతం మరో ఆరు కేసులు మల్కాజ్‌గిరి, నాంపల్లి కోర్టులలో నడుస్తున్నాయి. ఇందులో బాలానగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో కెల్విన్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసు మల్కాజ్‌గిరి కోర్టులో విచారణ దశలో ఉంది. కెల్విన్ విదేశాల నుంచి మాదక ద్రవ్యాలు తెప్పించి పలువురికి విక్రయించినట్లు ఎక్సైజ్ అధికారులు నేరాభియోగపత్రంలో పొందుపర్చారు.
కాగా, డ్రగ్స్ కేసులో ప్రముఖ సినీనటులు రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్, తరుణ్, పూరీ జగన్నాథ్, చార్మి, నవదీప్, నందు, ముబైత్ ఖాన్, తదితరులను అధికారులు విచారించిన విషయం తెలిసిందే.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications