కేసీఆర్ కు థ్యాంక్స్; రసమయికి నాకు రాజకీయాలు తెలియవన్న బాలయ్య!!
తాజాగా హిందూపురం ఎమ్మెల్యే , సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రసమయి బాలకిషన్ కూ తనకు రాజకీయాలు తెలియవని ఆయన పేర్కొన్నారు. రసమయి బాలకిషన్ తనకు సోదరుడు వంటి వాడని బాలకృష్ణ తెలిపారు. జగపతి బాబు ప్రధాన పాత్రలో రసమయి బాలకిషన్ నిర్మించిన రుద్రంగి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా హాజరైన బాలకృష్ణ ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణా సాంస్కృతిక సారధి చైర్మన్ గా రసమయి బాలకిషన్ ను నియమించటం పట్ల సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని బాలకృష్ణ ఈ కార్యక్రమంలో పేర్కొన్నారు. రుద్రంగి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన బాలయ్య, నిజంగా తనకు రసమయి బాల కిషన్ కు రాజకీయాలు రావని పేర్కొన్నారు. తెలంగాణా అవతరణ దశాబ్ది ఉత్సవాలు జరుపుకున్న తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇదిలా ఉంటే రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ సినిమా జూలై 7 వ తేదీన విడుదల కానుంది. కథ, పాత్రలలో వీక్షకులు లీనమయ్యేలా చేసే అరుదైన చిత్రాలలో రుద్రంగి సినిమా కూడా ఒకటి అని బాలయ్య పేర్కొన్నారు. ఇక ఈ సినిమా గురించి వివరించిన బాలయ్య రుద్రంగి సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న హీరో జగపతి బాబు పై వ్యాఖ్యలు చేశారు.

టాలీవుడ్ లోనే కాదు భారతీయ చలన చిత్ర పరిశ్రమలోనే గొప్ప నటుడు జగపతి బాబు అంటూ బాలకృష్ణ కితాబిచ్చారు. అప్పటికీ ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలో పరిస్థితులు మారాయని, ఒకప్పుడు తమ మనుగడ కోసం సినిమాలు చేస్తే, ఇప్పుడైతే తాము ఇండస్ట్రీ మనుగడ కోసమే సినిమాలు చేస్తున్నామని బాలయ్య తెలిపారు.

ఇక నటనంటే ఎంపిక చేసుకున్న పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం అని పేర్కొన్న బాలయ్య క్యారెక్టర్ లో జీవించటం గొప్ప నటించడం కాదంటూ పేర్కొన్నారు. ఇక రుద్రంగి సినిమా లో హీరో జగపతి బాబు తో పాటు ఆశిష్ గాంధీ, మమతామోహన్ దాస్, విమలారామన్ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు.












Click it and Unblock the Notifications