Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చిన్నప్పుడే తండ్రిముందు నడిచిన హరికృష్ణ, ఎందుకంటే: మంచు మనోజ్ విజ్ఞప్తి

హైదరాబాద్/నల్గొండ: నందమూరి హరికృష్ణకు సంబంధించి ప్రముఖ దర్శకుడు జాగర్లమూడి క్రిష్ ఓ ఫోటోను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. 'మార్పు కోసం రామ రథ చక్రాలు నడిపిన చైతన్య రథసారథ్యం. చిన్న నాడే జనం కోసం తండ్రి ముందు నడిచిన వారసత్వం' అని ఓ ఫోటోను ట్వీట్ చేశారు.

1962లో జాతీయ రక్షణ ఫండ్ యాక్టివిటీ సమయంలో తన తండ్రి ఎన్టీఆర్ ముందు హరికృష్ణ నడుస్తున్న దృశ్యం అది. క్రిష్.. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో బాలయ్య కథానాయకుడు. ఈ సినిమాల కోసం క్రిష్.. ఎన్టీఆర్, ఆయన కుటుంబ సభ్యుల జీవితాల గురించి పరిశోధనలు చేశారు.

Nandamuri Harikrishna dies in accident: Harikrishna in fathers footstep

1983 ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ ప్రచార రథసారథిగా ఆయన వెంట తన తండ్రికి హరికృష్ణ ఎంతో సేవ చేశారు. ఇప్పుడు ఆ పాత్రను బయోపిక్‌లో చూపించబోతున్నారు.

మంచు మనోజ్ విజ్ఞప్తి

హరికృష్ణ అకాల మృతి పట్ల నటుడు మంచు మనోజ్ సంతాపం తెలిపారు. అదే సమయంలో ఆయన మీడియాకు ఓ విజ్ఞప్తి చేశారు. హరికృష్ణ గారి మరణానికి సంబంధించిన రోడ్డు ప్రమాద దృశ్యాలను ప్రసారం చేయవద్దని, అలా ప్రసారం చేయడం వల్ల ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు, అభిమానులు మరింత కుంగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయనకు తగిన గౌరవాన్ని ఇవ్వాలని, తన వినతిని మన్నిస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. మరో రీట్వీట్‌లో ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ష ఉన్న ఫోటోలను ట్వీట్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+