Bathukamma Today:నాలుగోరోజు నానే బియ్యం బతుకమ్మ.. విశేషాలివే!!

తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పడుతూ తెలంగాణ జీవన వైవిధ్యాన్ని చాటి చెప్పే బతుకమ్మ పండుగ వాడ వాడలా తొమ్మిది రోజులపాటు ఘనంగా జరుగుతుంది. పేద, ధనిక తేడా లేకుండా అందరూ ఒకచోట కూడి ఆడి పాడి, గౌరమ్మను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా నిలిచే బతుకమ్మ పండుగ నాలుగవ రోజు నానే బియ్యం బతుకమ్మను జరుపుకుంటారు.

ఎంగిలిపూల బతుకమ్మతో మొదటి రోజు ప్రారంభం కాగా, ఎంగిలి పూల బతుకమ్మ నాడు అమ్మవారికి నైవేద్యంగా నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి సమర్పించారు. ఆపై అటుకుల బతుకమ్మ నాడు అమ్మవారికి సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో వండిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించారు. మూడవరోజు ముద్దపప్పు బతుకమ్మను జరుపుకున్న మహిళలు అమ్మవారికి ముద్దపప్పు, పాలు, బెల్లంతో తయారు చేసిన పదార్థాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు.

nane biyyam Bathukamma celebrations on fourth day of bathukamma celebrations

ఇక నాలుగో రోజు నేడు నానే బియ్యం బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారు. నానే బియ్యం బతుకమ్మ సందర్భంగా మహిళలంతా బతుకమ్మలను పేర్చి, మొదటి రోజు నుండి నాలుగో రోజు వరకు నాలుగు అంతరాల ఎత్తులో పూల సొగబులతో నవ్వుతూ ఆడపిల్లలని పలకరిస్తుంది. అందర్నీ ఆశీర్వదిస్తుంది బతుకమ్మ.

ఇక నాలుగవ రోజు బతుకమ్మలో భాగంగా ఉదయాన్నే మహిళలు తాజా పూలను తెచ్చి, శుభ్రం చేసుకుని పూలను నాలుగు అంతస్తులుగా పేరుస్తూ బతుకమ్మను తయారు చేస్తారు. తంగేడు, గునుగు, కట్ల, సీత జడ, రుద్రాక్ష వంటి పూల తోటి బతుకమ్మను తయారుచేసి, పసుపుతో గౌరమ్మను చేసి, గౌరమ్మను బతుకమ్మపైన ఉంచి అందులోకి గౌరమ్మను ఆవాహన చేస్తారు. ఆపై బతుకమ్మను ఇంట్లో పూజిస్తారు.

అమ్మవారికి నైవేద్యంగా నానబెట్టిన బియ్యం మెత్తగా రుబ్బి అందులో పాలు, బెల్లం కలిపి మృదువైన బియ్యం పిండి చలిమిడి తయారు చేస్తారు. ఈ బియ్యం పిండి చలిమిడి బతుకమ్మకు నైవేద్యంగా పెడతారు. సాయంత్రం అయిన తర్వాత ఇళ్ళ ముందు కానీ, అందరూ ఒక దగ్గరే కానీ బతుకమ్మలను చేర్చి ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు.

ఆపై బతుకమ్మలను తీసుకువెళ్లి ఊరి చెరువులో వదిలిపెడతారు. నానే బియ్యం బతుకమ్మకు పెట్టిన నానే బియ్యం పాలు బెల్లంతో చేసిన నైవేద్యాన్ని అందరికీ పంచి వారు కూడా ప్రసాదంగా తీసుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+