టెన్త్ స్టూడెంట్‌పై టీచర్ అఘాయిత్యం.. సీక్రెట్ కెమెరాలో రికార్డ్.. ట్విస్ట్ ఏంటంటే
పాఠశాలలకు వచ్చిన విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పి తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు వారి జీవితాలను నాశనం చేస్తున్న ఘటనలు దేశవ్యాప్తంగా అనేక చోట్ల చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లాలోని మద్దూరు పాఠశాలలో చోటు చేసుకున్న ఘటన ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తీసుకొచ్చింది.
బాలికపైన ఉపాధ్యాయుడి అఘాయిత్యం
55 సంవత్సరాల స్వామి అనే ఉపాధ్యాయుడు మార్చి 7వ తేదీన పదవ తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించి బాలికను కంప్యూటర్ ల్యాబ్ లోకి తీసుకుని వెళ్లి ముద్దు పెట్టుకున్నాడు. సీసీటీవీ పనిచేయదని భావించిన స్వామి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అయితే అతని ప్రవర్తనపైన అనుమానంతో మరొక ఉపాధ్యాయుడు సీక్రెట్ కెమెరాను పెట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

సీక్రెట్ కెమెరా పెట్టి రికార్డ్ చేసిన ఉపాధ్యాయుడు
ఈ అఘాయిత్యం తాలూకు వీడియోను రికార్డు చేసిన తోటి ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయుడు దగ్గరకు తీసుకువెళ్ళాడు. పాఠశాల పరువు పోతుందన్న ఉద్దేశంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వలేదు. స్థానిక సర్పంచ్ భర్తతో పాటు మరో నలుగురు వ్యక్తులు సాయంతో బాధితురాలు కుటుంబానికి డబ్బు ఆశ చూపి ఈ విషయం బయటకు రాకుండా ప్రయత్నం చేశారు.
బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్న టీచర్
తర్వాత కొద్దిరోజులకు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో, ఈ వ్యవహారం పోలీసుల దగ్గరకు చేరింది. దీంతో పోలీసులు కేసు నమోదుచేసి బాధితురాలు స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. ఈ వ్యవహారంలో స్వామి గతంలోనూ బాలిక ఇంటికి వెళ్లి బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు ప్రధాన నిందితుడు స్వామిపైన అత్యాచారంతో పాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.
సీక్రెట్ కెమెరా పెట్టిన టీచర్ డబ్బుల కోసం బెదిరింపు .. వీడియో లీక్
ఈ కేసులో సాక్షాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన హెడ్మాస్టర్ తో పాటు మరో ఉపాధ్యాయుడు, ఐదుగురు ప్రైవేట్ వ్యక్తులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు. ఇక ఈ కేసులో మరొక షాకింగ్ ట్విస్ట్ ఏంటి అంటే సీక్రెట్ కెమెరా పెట్టి వీడియో తీసిన ఉపాధ్యాయుడు, బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్న ఉపాధ్యాయుడిని 20 లక్షలు ఇవ్వాలని, ఇవ్వకపోతే ఈ వ్యవహారాన్ని బయటపెడతానని బెదిరించినట్లు సమాచారం. స్వామి ఆ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడం తోనే వీడియో లీక్ అయిందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications