తెలంగాణ "గోవా" అందాలు.. హైదరాబాద్ నుంచి 70 కి. మీ. దూరంలోనే..
హైదరాబాద్ నుంచి కేవలం 70 కి. మీ. దూరంలోనే గోవా రేంజ్ లో ఎంజాయ్ చేయాలని ఉందా..? అయితే ఈ ప్రదేశం మీకు బెస్ట్ ఆప్షన్ గా ఉంటుంది. అదే సింగూర్ డ్యామ్. సింగూర్ డ్యామ్ అనేది ఒక రిజర్వాయర్. ఈ డ్యామ్ ను హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న మంజీర నదిపై నిర్మించారు. డ్యామ్ పరిసరాలు ప్రకృతి సౌందర్యం, ప్రశాంత వాతావరణం కలిగి ఉంటుంది. హైదరాబాద్ నుంచి వీకెండ్స్ లో లేదా సెలవుల్లో ఇక్కడకు వందల సంఖ్యలో పర్యటకులు వస్తుంటారు.
సింగూర్ డ్యామ్ చుట్టూ ఉన్న పచ్చని ప్రాంతాలు, విశాలమైన నీటి రిజర్వాయర్ కను విందు చేస్తాయి. డ్యామ్ నుండి నీరు కిందకు ప్రవహించే దృశ్యం ఆకర్షణీయంగా, రమణీయంగా ఉంటుంది. ఇటీవల భారీ వర్షాల నేపథ్యంలో నిండు కుండలా సింగూర్ డ్యామ్ తొనికిసలాడుతోంది. 1989లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ డ్యామ్ 29 Mcft ల నీటి నిల్వ సామర్థ్యం కలిగిఉంది.

ఈ సింగూర్ డ్యామ్ ప్రాజెక్టును సంగారెడ్డి జిల్లా సింగూరు గ్రామం వద్ద నిర్మించారు. దీని సామర్థ్యం 30 టీఎంసీలుగా ఉంది. దీని ద్వారా 40,000 ఎకరాలు సాగవుతున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉన్న ఈ సింగూరు జలాశయంలో ప్రస్తుతం 1000 మొసళ్లు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
అయితే ఈ డ్యామ్ కు సమీపంలోనే మంజీరా వన్యప్రాణి అభయారణ్యం ఉంది. ఇది మగ్గర్ మొసళ్లకు నిలయంగా పేరుగాంచింది. అలాగే ఇక్కడ 70 కంటే ఎక్కువ పక్షి జాతులు, మంచినీటి తాబేళ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ పక్షులను వీక్షించేందుకు, మొసళ్ల సంరక్షణకు అనువైన ప్రదేశంగా భావిస్తారు. వీకెండ్ లో ఈ రెండు ప్రదేశాలను తక్కువ సమయంలోనే కవర్ చేయవచ్చు.












Click it and Unblock the Notifications