Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కెల్విన్ కాల్‌డేటాలో అగ్రస్థానం: నవదీప్‌పై కీలక ఆరోపణలివే, సుదీర్ఘ విచారణ

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుడు నవదీప్‌ను సిట్ సోమవారం విచారిస్తోంది. ఈ క్రమంలో ఆయన సోమవారం ఉదయం 10.30గంటలకు సిట్ అధికారుల ముందు హాజరయ్యారు.

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుడు నవదీప్‌ను సిట్ సోమవారం విచారిస్తోంది. ఈ క్రమంలో ఆయన సోమవారం ఉదయం 10.30గంటలకు సిట్ అధికారుల ముందు హాజరయ్యారు.

కెల్విన్‌తో సన్నిహిత సంబంధాలు

కెల్విన్‌తో సన్నిహిత సంబంధాలు

డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌తో నవదీప్‌కు సన్నిహిత సంబంధాలున్న నేపథ్యంలో ఆయనను సిట్ సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉంది. అంతేగాక, కెల్విట్ కాల్ డేటాలో కూడా నవదీప్ అగ్రస్థానంలో ఉన్నట్లు తెలిసింది. డ్రగ్స్ కేసులో నవదీప్‌కు సంబంధించిన పక్కా సమాచారం సేకరించిన సిట్.. ఆయనను లోతుగా ప్రశ్నిస్తున్నారు.

డ్రగ్స్ సరఫరా..

డ్రగ్స్ సరఫరా..

బీట్స్ అండ్ మినట్స్ పబ్‌లో నవదీప్ స్లీపింగ్ పార్ట్‌నర్‌గా ఉన్నట్లు తెలిసింది. అంతేగాక, పబ్బుల మాటున డ్రగ్స్ దందా నడిపించినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. కొకైన్‌కు పలు ఫ్లేవర్లు కలిపి డ్రగ్స్ సరఫరా చేసేవాడని ఆయనపై ఆరోపణలున్నాయి.

Recommended Video

    Tollywood drugs scandal : Tollywood Top Director, Heroes and 3 Heroines Names revealed
    మూడు కోణాల్లో..

    మూడు కోణాల్లో..

    ఈ క్రమంలో నవదీప్ విచారణ డ్రగ్స్ కేసులో కీలకంగా మారింది. నటుడిగా ఇండస్ట్రీతో పరిచయాలు, ఈవెంట్ ఆర్గనైజర్‌గా, పబ్ పార్ట్‌నర్‌గా.. ఈ మూడు కోణాల్లో సిట్ అధికారులు నవదీప్‌ను విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. జీషన్, మరో నైజీరియన్‌తో కలిసి నవదీప్ ఆన్‌లైన్లో డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం.

    గతంలోనూ..

    గతంలోనూ..

    కాగా, నవదీప్‌పై గతంలో రాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులుండటం గమనార్హం. ఇది ఇలా ఉండగా, సోమవారం ఉదయం ఇంటినుంచి బయల్దేరాల్సిన నవదీప్.. ఓ హోటల్ నుంచి నేరుగా సిట్ కార్యాలయానికి హాజరవడం గమనార్హం. కాగా, మీడియాతో అసౌకర్యం కలగకూడదనే ఈ విధంగా చేసినట్లు నవదీప్ స్నేహితులు చెప్పారు.

    పూరీ, నవదీప్‌లే కీలకం

    పూరీ, నవదీప్‌లే కీలకం

    టాలీవుడ్‌ను కుదిపేసిన డ్రగ్స్ కేసులో నోటీసులందుకున్న నటుల్లో డైరెక్టర్ పూరీ, హీరో నవదీప్‌‌ను కీలకమైన వ్యక్తులుగా సిట్ అధికారులు భావిస్తున్నారు. దేశ విదేశాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న నవదీప్ నటుడిగానే గాక ఈవెంట్ ఆర్గనైజర్‌గా కూడా చలామణి అవుతున్నాడు. ప్రముఖుల కుటుంబాల్లో జరిగే పార్టీలకు కూడా కావాల్సిన ఏర్పాట్లన్నీ తానే చేసేవాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో గోవా ముఠాకు సంబంధించిన కీలకమైన సమాచారం నవదీప్ నుంచి రాబట్టొచ్చని సిట్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+