నవీన్ హత్య కేసు: ఇద్దరితో ప్రేమాయణం నడిపిన యువతి.. ఫోన్లో విస్తుబోయే విషయాలు!!
నవీన్ హత్య కేసులో పోలీసులకు కనీసం సహకరించకుండా ప్రవర్తిస్తున్న యువతి తీరు అనేక అనుమానాలకు కారణం కాగా, తాజాగా యువతి సెల్ ఫోన్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నవీన్ ప్రేమించిన అమ్మాయిని, ప్రేమించిన హరిహర కృష్ణ అమ్మాయి కోసం నవీన్ ను అత్యంత పాశవికంగా నవీన్ తలా, మొండెం వేరుచేసి, వేళ్ళు కత్తిరించి, గుండె బయటకు తీసి, పొట్ట చీల్చి పేగులు బయటకు తీసి మారణ హోమానికి పాల్పడ్డాడని తెలిసిందే. ఇక ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఒక్కసారి వెన్నులో వణుకు పుట్టించింది. అయితే ఈ కేసు విచారణ చేస్తున్న పోలీసులకు ప్రియురాలి తీరు విస్మయాన్ని కలిగిస్తుంది.

నవీన్ హత్యకేసులో పోలీసుల దర్యాప్తులో విస్తు పోయే నిజాలు
పోలీసులకు కనీసం సహకరించకుండా, ఏమాత్రం భయం లేకుండా ప్రవర్తిస్తున్న యువతి తీరు అనేక అనుమానాలకు కారణం కాగా, తాజాగా యువతి సెల్ ఫోన్ డేటా ఆధారంగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు దర్యాప్తులో విస్తు పోయే నిజాలు నవీన్ హత్య కేసులో బయటకు వస్తున్నాయి. నవీన్, హరి హరకృష్ణ ల ప్రియురాలు అయిన యువతి ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫోన్లోని ఫోన్ కాల్స్ ను, మెసేజ్ లను పరిశీలించారు. అయితే యువతి ఒకేసారి ఇద్దరితో ప్రేమాయణం నడిపినట్టు, ఒకరికి తెలియకుండా ఒకరితో ఎఫైర్ పెట్టుకున్నట్టు పోలీసులు గుర్తించారు.

ఇద్దరితో యువతి ప్రేమాయణం.. నోరువిప్పని జగమొండి యువతి
హరి పక్కన యువతి ఉన్న సమయంలో నవీన్ చాలాసార్లు ప్రియురాలికి ఫోన్ చేసేవాడని, దీంతో హరికి వారిద్దరిపై అనుమానం వచ్చి, నవీన్ ఉంటే భవిష్యత్తులో తన ప్రియురాలు తనకు దక్కదని భావించి హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ కేసులో జగ మొండి యువతి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా మొరాయిస్తుంది. పోలీసులు పలుమార్లు ప్రశ్నించినప్పటికీ యువతి నోరు మెదపడం లేదు. నన్ను ఈ కేసులోకి లాగితే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతా అని బెదిరిస్తుంది. దీంతో పోలీసులు యువతని సఖి కేంద్రానికి తరలించి కౌన్సిలింగ్ ఇప్పించారు. అయినప్పటికీ యువతి పోలీసులకు ఏమాత్రం సహకరించడం లేదు.

మూడు సార్లు ప్రశ్నించినా సమాధానం చెప్పని యువతి
ఇప్పటివరకు మూడుసార్లు ప్రశ్నించిన పోలీసులు యువత నుంచి ఒక్క విషయాన్ని కూడా రాబట్టలేకపోయారు. కౌన్సిలింగ్ ఇప్పించిన యువతిలో ఎటువంటి మార్పు రాలేదని, ఎలాంటి భయము లేకుండా నాకు ఈ కేస్ తో సంబంధం లేదని చెబుతుందని పోలీసులు వెల్లడిస్తున్నారు. యువతి నోరు విప్పితే మరిన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. యువతి ఫోన్లో దొరికిన సమాచారాన్ని బట్టి పోలీసులు ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు.

పోలీసులకు విచారణకు సహకరించని హరి హరకృష్ణ
ఇదిలా ఉంటే వారం రోజులపాటు హరి హరికృష్ణ ను పోలీసులు కస్టడీలోకి తీసుకోవడానికి గురువారం కోర్టు అనుమతిని ఇవ్వడంతో, హరి హరకృష్ణ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇక హరి హరకృష్ణ కూడా పోలీసుల విచారణకు సహకరించడం లేదని తెలుస్తుంది. ఇక మరోవైపు హరి హరకృష్ణ హత్య చేశాడు అని తెలిసిన తర్వాత కూడా ఇంట్లో ఆశ్రయమిచ్చిన నవీన్ ఫ్రెండ్ హసన్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ఈ ట్రయాంగిల్ క్రైమ్ లవ్ స్టోరీ లో హరి హరకృష్ణ, సదరు యువతి నోరు విప్పితే అసలు ఏం జరిగిందో బయటకు వస్తుంది.












Click it and Unblock the Notifications