నవీన్ యాదవ్‌కు గుడ్ న్యూస్.. కీలక పదవి ఇవ్వనున్న సీఎం రేవంత్ !
నవీన్ యాదవ్.. తెలంగాణలో తీవ్ర చర్చకు తెరలేపిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఘన విజయం సాధించారు. ఈ బై ఎలక్షన్ లో దాదాపు 25 వేల ఓట్ల మెజార్టీతో విజయ దుందుభి మోగించారు. తన 16 ఏళ్ల పొలిటికల్ కెరీర్లో ఫస్ట్ టైమ్ విక్టరీ కొట్టారు. మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనివార్యం కావడంతో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి.. బీఆర్‌ఎస్ అభ్యర్థిపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ క్రమంలోనే ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం కీలక పదవి కట్టబెట్టనుందని జోరుగా చర్చ నడుస్తోంది.
పొలిటికల్ కెరీర్..
నవీన్ యాదవ్ తొలిసారిగా 2009లో ఎంఐఎం పార్టీ నుంచి యూసుఫ్‌గూడ డివిజన్ కార్పొరేటర్‌గా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మురళీ గౌడ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం తరఫున జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు.

మళ్లీ 2015లో మరోసారి ఎంఐఎం అభ్యర్థిగా రహ్మత్‌నగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ మద్దతు లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా జూబ్లీహిల్స్ నుంచి బరిలోకి దిగి 18,817 ఓట్లతో సరిపెట్టుకున్నారు. ఆ తర్వాత 2023లో అప్పటి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తొలిసారిగా విజయం సాధించారు.
ప్రభుత్వ విప్ పదవి..
కాగా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయంతో నవీన్ యాదవ్ కు ప్రభుత్వ విప్ పదవి దక్కే అవకాశం ఉందని అంటున్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనకు ప్రభుత్వ విప్ పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీలో ముగ్గురు ప్రభుత్వ విప్ లు ఉండగా.. మరో నలుగురిని నియమించుకునే అవకాశం ఉంది. దాంతో బీసీ సామాజికవర్గానికి చెందిన ఆయనకు పదవి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. అంతే కాకుండా హైదరాబాద్ నుంచి అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడంతో.. మరొకరికి మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కాదని విప్ పదవి ఇచ్చేందుకు అదిష్టనం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు.
మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో యాదవ సామాజిక వర్గం పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇన్నాళ్లు గ్రేటర్ పరిధిలో ఆ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో లేరు. ఇప్పుడు నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఆయనకు ఏఏ సమీకరణాలు కూడా కలిసొచ్చాయని స్పష్టం అవుతోంది.












Click it and Unblock the Notifications