హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దిమ్మతిరిగే నయీం ఆస్తులు: ఎంతో తెలుసా, వాటినేం చేస్తారు?

తవ్వుతున్న కొద్దీ నయీం ఆస్తులు బయటపడుతున్నాయి. వాటి విలువ దాదాపు రూ. 500 కోట్లు ఉంటుందని అంచనా. వాటిని స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది...

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఎన్‌కౌంటర్‌లో మరణించిన నయీం దిమ్మతిరిగే ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది. అతను తన అనుచరులతో చుట్టేసి కబ్జా చేసిన భూముల గురించి తెలిస్తే షాక్ తినక తప్పదు. తన కుటుంబ సభ్యులు, అనుచరుల పేర్లతో ఏకంగా 1015 ఎకరాలు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

నయీం రాజధాని హైదరాబాదు చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ జిల్లా కేంద్రాల్లోనూ 1,67,000 గజాల ఇళ్ల స్థలాలను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. నయీం అక్రమాస్తుల విలువ రూ.500 కోట్ల వరకూ ఉండవచ్చునని అంచనా వేశారు. ఆక్రమించుకున్న ఆస్తులను బాధితులకు అప్పగించే అంశంపై ఆలోచన చేస్తున్నారు.

అక్రమాస్తులను చట్టబద్ధం చేసుకునేందుకు నయీం పథక రచన చేసినట్లు చెబుతున్నారు. ఆస్తులను చట్టబద్ధంగా తన పేరుతోనే, అనుచరులు, బంధువుల పేరుతోనే రిజిస్ట్రేషన్‌ చేయించుకునేవాడని అంటున్నారు. నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత అతనితోపాటు అతని కుటుంబ సభ్యులు, అనుచరుల ఇళ్లలో జరిపిన సోదాల్లో ఆస్తుల పత్రాలు పోలీసులకు చిక్కాయి.

 ఇలా స్వాధీనం చేసుకోవచ్చా..

ఇలా స్వాధీనం చేసుకోవచ్చా..


నయీం తన పేర, తన కుటుంబ సభ్యులు, అనుచరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూములను ప్రభుత్వం ఎలా స్వాధీనం చేసుకుంటుందనేది సమస్యగా మారింది. ఒకసారి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వ్యక్తేకే అన్ని హక్కులూ లభిస్తాయి. బెదిరింపులతో ఆస్తులు కూడపెట్టుకున్నా అన్ని ఆస్తులను సంపాదించే శక్తి నయూంకు లేదన్న కారణాలతో అక్రమాస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. అక్రమాస్తులను బాధితులకు అప్పగించే విషయంలో చట్టపరమైన సమస్యలు వస్తాయని భావిస్తున్నారు. దీంతో నయీం ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 ఆ భూములు బాధితులకు దక్కవా...

ఆ భూములు బాధితులకు దక్కవా...

పలువుర్ని బెదిరించి బలవంతంగా తీసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూములు కాబట్టి వాటిని బాధితులకు అప్పగించాలనే వాదన ఉంది. పోలీసు అధికారులు, ప్రభుత్వ పెద్దలు కూడా దాన్ని తొలుత సమర్థించారు. ఈ ప్రక్రియ న్యాయస్థానం ద్వారానే జరగాల్సి ఉంటుంది. అయితే, ఆక్రమించుకున్న ఆస్తులు బాధితులకు అప్పగించేందుకు సాంకేతికపరమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

 రెండు రకాలుగా నయీం ఆస్తులు...

రెండు రకాలుగా నయీం ఆస్తులు...

ఆక్రమణల్లో నయీం చట్టబద్దమైన వ్యూహాన్ని అనుసరించాడు. నయీం రెండు రకాలుగా ఆస్తులు సంపాదించేవాడు. తన అనుచరుల ద్వారా ఆస్తుల సమాచారం సేకరించి, వాటి యజమానులకు ఎంతో కొంత ముట్టజెప్పి ఆక్రమించుకునే వాడు. ఎవరైనా భాగస్వామ్య వివాదాలతో తన వద్దకు వస్తే ఇద్దర్నీ కాదని ఆ ఆస్తిని తనపరం చేసుకునేవాడని అంటున్నారు. ఆక్రమించుకున్న ఆస్తులను నయానోభయానో చట్టబద్ధంగా తన పేరుతోనే, అనుచరులు, బంధువుల పేరుతోనే రిజిస్ట్రేషన్‌ చేయించుకునేవాడు. సంబంధిత దస్త్రాలన్నీ తన వద్దనే ఉంచుకునేవాడు.

ఆ ఆస్తులు చట్టబద్దమే, ఎలా...

ఆ ఆస్తులు చట్టబద్దమే, ఎలా...

తమ నుంచి నయీం బలవంతంగా ఆస్తులు స్వాధీనం చేసుకున్నాడని బాధితులు చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారు. అయితే, వాటి విలువ పోలీసుల వద్ద ఉన్న నయీం ఆస్తుల జాబితాలో నాలుగోవంతు కూడా లేదు. నయీం, ఆయన అనుచరుల పేరుతో ఉన్న ఆస్తులను వాటి అసలు యజమానుల వాంగ్మూలం ఆధారంగా న్యాయస్థానం ద్వారా వారికే స్వాధీన పరచాలని పోలీసులు తొలుత భావించారు. అయితే ఒకసారి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వ్యక్తేకే అన్ని హక్కులూ సంక్రమిస్తాయి. దాంతో అలా వారికి తిరిగి స్వాధీన పరచడంలో చట్టపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి.

English summary
Government is facing legal obstacles in acquiring assets of Nayeem, which valued about Rs 500 crores.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X