వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నయీం కేసు: శేషన్న కొరియర్ సోమన్న అరెస్టు, తనతో గొడవపడినవారితోనే..

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పోలీసుల చేతిలో హతమైన గ్యాంగస్టర్ నయీం అనుచరుల్లో మరో వ్యక్తి పోలీసులకు చిక్కాడు. సికింద్రాబాదులోని ఈసీఐఎల్‌ సమీపంలోని ద్వారకానగర్‌లో నయీం అనుచరుడు సోమన్నను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న శేషన్నకు సోమన్న కొరియర్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడు సోమన్నపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నయీం అనుచరుల్లో శేషన్నది కీలకమైన పాత్రగా దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. సోమన్న అరెస్టు ద్వారా శేషన్నను అరెస్టు చేసేందుకు మార్గం ఏర్పడినట్లు భావిస్తున్నారు. కాగా, పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా నయీం భార్య హసీనా, సోదరి ఖలీమా బేగంలను తదుపరి విచారణ కోసం తమ కస్టడీకి ఇవ్వాలని సిట్ పోలీసులు రాజేంద్రనగర్ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు.

పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి ఇరువురికి నేటి నుంచి తొమ్మిది రోజుల వరకు కస్టడీ విధించింది. దీంతో పోలీసులు ఇరువురిని తమ కస్టడీలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, నయీం కారు డ్రైవరు శామ్యూల్ పీటీ వారెంట్‌ను కోర్టు తోసిపుచ్చింది.

Nayeem case: Seshanna's key follower arrested

ఇలా అనుకూలంగా మార్చుకునేవాడు....

తనను వ్యతిరేకించి, తనతో తలపడడానికి సిద్ధపడినవారిని నయీం పక్కాగా తన అనుచరులుగా మార్చుకునేవాడని, తాను అనుకున్న నేరాలను వారితోనే చేయించేవాడని అంటున్నారు. పథకం ప్రకారం నేరాలకు ఉసిగొలుపుతూ చివరి వరకు నయీం తాను పర్యవేక్షించేవాడని చెబుతున్నారు. కొనపురి రాములును కాల్చిచంపిన షార్ప్‌ షూటర్లు పోలీసుల వి చారణలో వెల్లడించిన అంశాలు నయీం ఆపరేషన్‌ విధానాన్ని తెలియజేస్తున్నాయి.

తనతో గొడవకు సిద్ధపడిన వ్య క్తులు, తనపై కథనాలు ప్రచురించిన మీడియా ప్రతినిధులను, తన కదలికపై నిఘా వేసిన పోలీసులను నయీం తనకు అనుకూలంగా మలుచుకునేవాడని చెబుతున్నారు. ఏదైనా విషయంలో తనకు వ్యతిరేకంగా పనిచిసిన వారిని మొదట బెదిరించి వెళ్లగొట్టేవాడని, తర్వాత వారిని గు ర్తించి డబ్బు, మందు, విందు వంటివి ఆశ చూపించి తన ముఠాలో సభ్యుడిగా చేర్చుకునేవాడని మీడియాలో కథనాలు వచ్చాయి.

కొనపురి రాములు హత్యలో కీలక పాత్రధారి అయిన చిలుకరాజు సురేష్‌ అలియాస్‌ వెంకటేశ్‌ అలియాస్‌ నవీన్‌ ను అదే పద్ధతిలో దారికి తెచ్చుకున్నట్లు చెబుతున్నారు. హైదరాబాదులోని వనస్థలిపురంలో టైలరింగ్‌ చేసుకుంటూ బతికే సురేశ్‌ 2005లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలోకి అడుగు పెట్టాడు.

ఒక ప్లాట్‌ విషయంలో పుష్ప అనే మహిళ, ఆమె భర్త గణే్‌షలతో సురేశ్‌కు వివాదం తలెత్తింది. వారు నయీంను ఆశ్రయించడంతో సురేశ్‌ 75 గజాల ఇంటి స్థలాన్ని వదిలిపెట్టాడని, తర్వాత నయీం డబ్బులు ఎరవేసి అతన్ని లొంగదీసుకున్నాడని అంటున్నారు. 2011 మార్చిలో మాజీ మావోయిస్టు కొనపురి సాంబశివుడిని హత్య చేసే బాధ్యతను, అదే ఏడాది నవంబరులో అతడి తమ్ముడు కొనపురి రాములును హత్య చేసే బాధ్యతనూ సురేశ్‌కు అప్పగించాడు. ఐ10 సీఈవో హరిప్రసాద్‌రెడ్డిని కూ డా అదే పద్ధతిలో తన దారిలోకి తెచ్చుకున్నట్లు చెబుతున్నారు.

English summary
Another Nayeem's follower somanna has been arrested by police at ECIL in Secendurabad. It is said that Somanna has worked as courier to Seshanna, a key member in Nayeem's gang.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X