వైఎస్సార్ బ్రాండ్ ఇమేజ్ ఎవరి సొంతం? రేవంత్ రెడ్డి, వైఎస్ షర్మిల రచ్చతో కొత్తచర్చ!!

YSR బ్రాండ్ ఇమేజ్ ఎవరిది? వైఎస్ఆర్ బ్రాండ్ ఇమేజ్ కోసం రేవంత్ రెడ్డి, వైఎస్ షర్మిల పోరు తెలంగాణ ప్రజల్లో చర్చనీయాంశమైంది.

తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వైఎస్ షర్మిల మధ్య ఇటీవల మాటల యుద్ధం కొనసాగుతుంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి బ్రాండ్ ఇమేజ్ ను తమ ఖాతాలో వేసుకోవాలని వైఎస్ షర్మిల ప్రయత్నం చేస్తుంటే, అందుకు అడ్డు తగులుతూ రేవంత్ రెడ్డి పదేపదే వైయస్ రాజశేఖర్ రెడ్డి బ్రాండ్ ఇమేజ్ ను కాంగ్రెస్ ఖాతాలో వేసే పని మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇద్దరు నేతల మధ్య మాటలు యుద్ధం జరుగుతుంది. వైఎస్సార్ బ్రాండ్ ఇమేజ్ కోసం జరుగుతున్న వార్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

 వైఎస్సార్ కోసం రేవంత్ రెడ్డి వర్సెస్ వైఎస్ షర్మిల

వైఎస్సార్ కోసం రేవంత్ రెడ్డి వర్సెస్ వైఎస్ షర్మిల

తెలంగాణ రాష్ట్రంలో హాత్ సే హాత్ జోడో పాదయాత్ర చేస్తున్న రేవంత్ రెడ్డి తాను సాగిస్తున్న పాదయాత్రలో పదేపదే వైఎస్సార్ ప్రస్తావన తెస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం తన ఊపిరి ఉన్నంతవరకు పని చేశారని, ఆయన అడుగు జాడల్లో ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రంలో సుభిక్షమైన పాలన సాగిస్తామని చెప్తూ వస్తున్నారు. వైఎస్ షర్మిల రాజన్న రాజ్యం తెస్తామని, సంక్షేమ పాలన అందిస్తామని వైఎస్సార్ బ్రాండ్ తో జనాల్లోకి వెళ్తుంటే, రేవంత్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ఆస్తి అన్నట్టు చేస్తున్న ప్రచారం వైఎస్ షర్మిలకు ఆగ్రహం తెప్పిస్తుంది.

వైఎస్ షర్మిలకు చెక్ పెట్టే రేవంత్ వ్యూహం

వైఎస్ షర్మిలకు చెక్ పెట్టే రేవంత్ వ్యూహం

వైఎస్సార్ తన జీవితమంతా కాంగ్రెస్ పార్టీ కోసమే బతికారని, కాంగ్రెస్ పార్టీలోనే పనిచేశారని, కాంగ్రెస్ తరపున పథకాలు ప్రవేశపెట్టారని, కాంగ్రెస్ నేతగానే ఆయన మరణించారని రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. వైయస్ షర్మిల వైయస్సార్ తెలంగాణ పార్టీని పెట్టింది కేవలం కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును చీల్చడం కోసమే అని భావిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే వైయస్సార్ పై తన ప్రచారంలో కీలక వ్యాఖ్యలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.

ఉనికి ప్రశ్నార్ధకం అవుతుందన్న ఆందోళనలో వైఎస్ షర్మిల ఆగ్రహం

ఉనికి ప్రశ్నార్ధకం అవుతుందన్న ఆందోళనలో వైఎస్ షర్మిల ఆగ్రహం

ఇక ఈ క్రమంలో రాజన్న రాజ్యం తీసుకువస్తామని, వైయస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలనను గుర్తు చేస్తూ ప్రచారం చేస్తున్న వైయస్ షర్మిల తమ పార్టీ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని భావించి రేవంత్ రెడ్డిని తిట్టిపోస్తున్నారు. ఓటుకు నోటు దొంగను జనాలు నమ్మడం లేదని, మహానేత పేరును వాడుకుంటున్న రేవంత్ కు వైయస్సార్ అభిమానులు బుద్ధి చెబుతారని వైయస్ షర్మిల చెబుతున్నారు. అలాగే గతంలో వైఎస్సార్ మీద రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను గుర్తు చేసి జనం మర్చిపోరని చెప్తున్నారు.

వైఎస్సార్ బ్రాండ్ ఇమేజ్ ఎవరి సొంతం?

వైఎస్సార్ బ్రాండ్ ఇమేజ్ ఎవరి సొంతం?

ఇక వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న కొత్త రచ్చతో వైయస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైయస్ షర్మిల పార్టీ పెట్టింది కాబట్టి వైయస్సార్ బ్రాండ్ ఇమేజ్ ఆమె పెట్టిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి దక్కుతుందా? లేక వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నేతగా రాజకీయాలు చేసి, కాంగ్రెస్ పార్టీ నుండి ముఖ్యమంత్రిగా కొనసాగి, కాంగ్రెస్ నేతగానే మరణించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఆయన బ్రాండ్ ఇమేజ్ దక్కుతుందా? అన్నది ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాలలోను, ప్రజలలోను ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. వైయస్సార్ ఎవరికి సొంతం అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇక ప్రజలు వైయస్సార్ పై ఉన్న అభిమానంతో షర్మిలను ఆదరిస్తారా? లేక కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తారా అన్నది మాత్రం ముందు ముందు తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+