వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త వాహనాల చట్ట సవరణ బిల్లు..! అతిక్రమిస్తే పడుతుంది వాహనదారుల జేబుకు చిల్లు...!!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్ : వాహన దారులకు కొత్తగా వచ్చిన నిబంధనలు జేబుకు చిల్లుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. నిబంధనలకు విరుద్దంగా ఏ ఒక్క అడుగుపడినా అందుకు తగిన మూల్యం భాకరీగా ఉంటుందని కేంద్రం ప్రభుత్వం చెప్పుకొస్తోంది. అందులో భాగంగా కొన్ని నిబంధనలకు సంబందించిన నియమ నిభంధనలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లు 2019లో భాగంగా కొత్త రూల్స్ తో వాహనదారులకు చుక్కలు కనపడనున్నాయి.

కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, భారీ జరిమానాలు సబబేనని, దీనివల్ల ప్రమాదాల సంఖ్య తగ్గుతుందని అన్నారు. కొత్త బిల్లును ప్రకారం అత్యవసర వాహనాలకు తప్పనిసరిగా దారి ఇవ్వాల్సిందే. ఇక ఈ బిల్లులో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.ఇకపై ఏదైనా అంబులెన్స్ వస్తుంటే దానికి దారి ఇవ్వకుంటే 10 వేల రూపాయలు జరిమానాగా చెల్లించాలి. * ఇక లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే 5 వేల రూపాయలు కట్టాల్సిందే. * ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘనలపై ప్రస్తుతం 100 రూపాయలుగా ఉన్న జరిమానా, ఇకపై 500 రూపాయలకు పెరగనుంది.

New Vehicle Amendment Bill.!Violators can be punished with fine..!!

* పోలీసులు వాహనాలను ఆపాలని కోరినప్పుడు ఆపకుండా వెళితే 2 వేల రూపాయలు పెనాల్టీ పడుతుంది. * లైసెన్స్ ను ఇంటి దగ్గర మరచి డ్రైవింగ్ చేస్తున్నా భారీ జరిమానా తప్పదు. * ఇంటి వద్ద లైసెన్స్ ఉంచి వాహనంతో రోడ్డుపైకి వచ్చి చిక్కితే 5 వేల రూపాయలు. * బీమా ఉండి కూడా దాని నకలు లేకుండా నడిపితే 2 వేల రూపాయలు ఫైన్ పడుతుంది. * ఓవర్ స్పీడ్ గా నడిపితే 1000 రూపాయల నుంచి 2 వేల రూపాయలు.

* సీట్ బెల్ట్ లేకుంటే 1000 రూపాయలు జరిమానా చెల్లించుకోవాల్సిందే. * హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాన్ని నడిపితే 1000రూపాయలు. * మైనర్లకు వాహనాన్ని ఇస్తే, వాహన యజమాని లేదా గార్డియన్ పై 25 వేల రూపాయలు జరిమానాతో పాటు మూడేళ్ల జైలుశిక్ష తప్పదు. ఇదే సమయంలో వాహన రిజిస్ట్రేషన్ కూడా రద్దు అవుతుంది. * వాహనాలను ఓవర్ లోడ్ చేస్తే 20 వేల రూపాయలు, * ర్యాష్ డ్రైవింగ్ కు 5 వేల రూపాయలు. * మందు కొట్టి వాహనం నడిపితే 10 వేల రూపాయలు. ఇక ఏ మాత్రం అజాగ్రతగా ఉన్నావాహనదారులకు తిప్పలు తప్పవు అన్నట్లు కొత్త చట్టంలో నిబంధనలను పొందుపరిచారు.

English summary
Motor Vehicle Law Amendment Bill 2019 is set to see dots for motorists with new rules. Union Transport Minister Nitin Gadkari said the huge fines will be reduced and the number of accidents will be reduced. Emergency vehicles must be routed according to the new bill. The headlines in this bill are like this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X