న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు, ఆ మార్గాల మూసివేత, తాగి దొరికితే అంతే సంగతులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆంక్షలు విధిస్తున్నారు హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర పోలీసులు. హైదరాబాద్‌లో మాత్రం మరింత కఠినంగా అమలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలతో పాటు.. కఠిన ఆంక్షలు అమలు చేయనున్నారు.

హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, ఆ మార్గాల్లో నిషేధం
రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు హైదరాబాద్‌లోని అన్ని ఫ్లైఓవర్లను మూసివేయనున్నట్టు ఇప్పటికే సీపీ సీవీ ఆనంద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ప్రకటన విడుదల చేశారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు. నెక్లెస్ రోడ్ చుట్టూ ట్రాఫిక్ నిబంధనలు అమల్లో ఉంటాయన్నారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ పై వాహన రాకపోకలు నిషేధించినట్టు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి (డిసెంబర్ 31) నుంచి జనవరి 1న ఉదయం వరకు హైదరాబాద్‌లోని అన్ని ఫ్లై ఓవర్ల మూసివేస్తామని, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలతో పాటు.. అతి వేగంగా ప్రయాణించేవారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ట్రిపుల్ రైడర్స్ పై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు హైదరాబాద్ సీపీ.

బార్లు, పబ్బులకు హెచ్చరికలు, మైనర్లకు నో ఎంట్రీ
కాగా, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు గురువారం సైబారాబాద్ పోలీసు కమిషనరేట్ పరిదిలోని బార్లు, పబ్‌ల యజమాన్యంతో పోలీసులు సమీక్ష సమావేశం నిర్వహించారు. నూతన సంవత్సర వేడుకల నియంత్రణను కఠినతరం చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో నిబంధనలను కఠినతరం చేశామన్నారు. మైనర్లను పబ్‌లకు అనుమతించొద్దని, కరోనా నిబంధనలను పాటించాలని పబ్, బార్ యజమానులను ఆదేశించారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, కఠిన చర్యలంటూ హెచ్చరికలు
సైబారాబాద్ పోలీసు కమిషనర్ సూచనల మేరకు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎమ్ విజయ్ కుమార్ సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు. పబ్‌లు, బార్‌ల యజమానులు ఆరోగ్యశాఖ విధించిన మార్గదర్శకాలను ఉల్లంఘించవద్దంటూ సూచించారు. ఆంక్షలు నిబంధనల ప్రకారం వేడుకలు నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి అన్ని ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకల సమయంలో, తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ దొరికితే జైలు, జరిమానా శిక్షలుంటాయని తెలిపారు. శాంతియుత వాతావరణంలో మాత్రమే వేడుకలు జరుపుకోవాలని కోరారు. వేడుకల సమయంలో కరోనా ప్రోటోకోల్‌ను కచ్చితంగా పాటించాలని సూచించారు. కాగా, న్యూఇయర్ వేడుకల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి 12 గంటల వరకూ మద్యం దుకాణాలు, అర్ధరాత్రి ఒంటి గంట వరకూ బార్లు, పబ్బుల్లో మద్యం సరఫరా ఉంటుందని మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.

ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధమంటూ డీజీపీ మహేందర్ రెడ్డి
కరోనా నిబంధనలకు అనుగుణంగా న్యూఇయర్ వేడుకలు జరుపుకోవాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. హైదరాబాద్‌లో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. వేడుకలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని ప్రజలను కోరారు. కరోనా వేరియంట్ ఒమిక్రాన్ నియంత్రణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. జనవరి 2వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. పబ్బులు, ఈవెంట్లలో ప్రభుత్వ ఆదేశాలని పాటించాలన్నారు. కరోనా నిబంధనలు అమలు చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చామని తెలిపారు. కరోనా నిబంధనలను పోలీస్ శాఖ కఠినంగా అమలు చేస్తుందని డీజీపీ స్పష్టం చేశారు.
-
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications