న్యూస్ మేకర్: టిఎస్‌పిఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)కి తొలి చైర్మన్‌గా నియమితులైన ఘంటా చక్రపాణి.. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో సరికొత్త ఒరవడి నెలకొల్పారు. ఆన్‌లైన్‌లో నియామక పరీక్షల నిర్వహణ ద్వారా జాతీయ ద్రుష్టిని ఆకర్షించారు. రాష్ట్ర నిరుద్యోగ యువత ఆకాంక్షలు నెరవేర్చేందుకు తనదైన శైలిలో ప్రయత్నిస్తున్నారు. ఈయన హయాంలో టిఎస్‌పిఎస్సీకి పలు అవార్డులు కూడా వచ్చాయి.

ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పిజి చేసిన ఘంటా చక్రపాణి ఓపెన్ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ప్రగతిశీల ఉద్యమాలతో కలిసి పనిచేసిన ఆయన టిఎస్‌పిఎస్‌సి చైర్మన్‌గా నియమితులయ్యారు. దాంతో తెలంగాణ నిరుద్యోగ యువత ఆయనపై పలు ఆశలు పెట్టుకుంది.
యువత ఆశలను నెరవేర్చడానికి, వారికి ఉద్యోగాలను కల్పించడానికి తీవ్రంగా కృషి చేస్తూ తెలంగాణ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడని ప్రసిద్ది పొందారు. నిత్యం ఆయన ఉద్యోగాల నోటిఫికేషన్ల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.












Click it and Unblock the Notifications