కాబోయే ముఖ్యమంత్రి 'కేటీఆర్'! హైదరాబాద్‌లో వెలిసిన ఫ్లెక్సీలు
హైదరాబాద్:టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ అవుతారని ఇప్పటికే పలువురు మంత్రులు, ఆ పార్టీ నేతలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, బీఆర్ఎస్ పార్టీ ప్రకటనతో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆ పార్టీ ప్రకటనతో మంత్రి కేటీఆర్ సీఎం అవడం లాంఛనమైనట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అంటూ నేతలంతా గొంతెత్తి చాటుతున్నారు. ఇక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న కేటీఆర్‌కు కాబోయే సీఎం కేటీఆర్‌కు స్వాగతం అంటూ ఫ్లెక్సీలు స్వాగతం చెబుతుండటం చర్చనీయాంశంగా మారింది.

తాజాగా కూకట్‌పల్లిలో మంత్రి కేటీఆర్‌కు స్వాగతం పలుకుతూ.. టీఆర్ఎస్ శ్రేణులు పెట్టిన ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్‌కు స్వాగతం అంటూ కొందరు నేతలు ఫ్లెక్సీలు పెట్టారు. కొన్ని నెలల క్రితం ఈ తరహాలోనే కేటీఆర్ ముఖ్యమంత్రి అంటూ జోరుగా ప్రచారం సాగింది. ఆ తర్వాత ఇందుకు ముగింపు పడింది.
తిరిగి మళ్లీ ఇప్పుడు కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఫ్లెక్సీలు పెట్టడం ఆసక్తికరంగా మారింది. అయితే, కేటీఆర్ మాత్రం కేసీఆర్ రాజకీయాల్లో ఉన్నంత వరకు ఆయనే సీఎంగా ఉంటారని చెబుతున్నారు. అయితే, టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం కేటీఆర్ త్వరలోనే సీఎం అవుతారని భావిస్తున్నాయి.
-
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
Kavitha: తెలంగాణలో కవితకు పెరుగుతున్న క్రేజ్..కేటీఆర్‌ను దాటేస్తోందా..? -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!











Click it and Unblock the Notifications