తెలంగాణకు చల్లని కబురు: ఐదురోజులపాటు భారీ వర్షాలు, ఈ జిల్లాలకు అలర్ట్

తీవ్రమైన ఎండలు, వడగాలులు, ఉక్కపోతతో సతమతమవుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రేపట్నుంచి (ఆదివారం) నుంచి రాగల ఐదు రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే జూన్ 3వ తేదీ నుంచి ఉష్ణోగ్రతలు క్రమేపి తగ్గి వాతావరణం చల్లబడుతుందని స్పష్టం చేసింది.

ఆదివారం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం‌ ఉందని పేర్కొంది.
ఉరుములు, మెరుపులు, 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.

Next five days normal to heavy rain in telangana state alert for these district

భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వానలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. హైదరాబాద్‌తో సహా పలు జిల్లాల్లో వానలు పడే సూచనలున్నాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

మే 30న రుతుపవనాలు కేరళను తాకాయని జూన్ 5, 6 తేదీల్లో తెలంగాణ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. గత రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 44 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ పేర్కొంది. శుక్రవారం పెద్దపల్లి జిల్లాలోని కమాన్‌పూర్‌లో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం.

కరీంనగర్ జిల్లాలో తీవ్రమైన ఎండలు, వడగాలుల ప్రభావంతో శుక్రవారం ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కాగా, శనివారం ఆదిలాబాద్​, మంచిర్యాలలో 45 డిగ్రీలు కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. శనివారం కొన్ని జిల్లాల్లో సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ముందుగానే నైరుతి రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు దేశంలోని పలు ప్రాంతాల్లోకి అనుకున్న తేదీ కన్నా ముందే ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే త్రిపుర, మేఘాలయ, అసోం, పశ్చిమబెంగాల్​, సిక్కింలోకి ప్రవేశించాయని తెలిపింది. లక్షద్వీప్​, కేరళ, కర్ణాటక, తమిళనాడు సహా పలు ప్రాంతాల్లోకి ముందే ప్రవేశించే పరిస్థితులు కనిపిస్తున్నాయని వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+