ka paul: మునుగోడులో గెలిస్తే, ఇక నెక్ట్స్ సీఎం..యూత్ అంటూ, హాట్ కామెంట్స్
మునుగోడు ఉప ఎన్నికలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ ఆయన నల్గొండలో మీడియాతో మాట్లాడారు. ఎన్నిక గురించి మాట్లాడారు. విజయం తనదేనని మరోసారి ధీమాను వ్యక్తం చేశారు. పనిలో పనిగా సీఎం కేసీఆర్‌పై ఆరోపణలు గుప్పించారు. ప్రచారంలో కూడా తమను అడ్డుకున్నారని కామెంట్ చేశారు.

ఆదరణ.. నెక్ట్స్ సీఎం
నియోజకవర్గ ప్రజలు తనను ఆదరించారని పాల్ వివరించారు. ఇక్కడ తనదే విజయం అని స్పష్టంచేశారు. మునుగోడులో విజయం సాధిస్తే.. నెక్ట్స్ టార్గెట్ సీఎం పదవీ అని తెలిపారు. తెలంగాణకు నెక్ట్స్ సీఎం తానే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చూసి టీఆర్ఎస్ పార్టీ నేతలు ఓర్వలేకపోతున్నారని వివరించారు. అందుకే మూడుసార్లు తనపై దాడికి తెగబడ్డారని ఆరోపణలు చేశారు.

లక్షా 10 వేల ఓట్లు
మునుగోడులో లక్షా 10 వేల ఓట్లు ఉంగరం గుర్తుకు పడతాయని వివరించారు. దానికి సంబంధించి పూర్తి లెక్క తన వద్ద ఉందన్నారు. 50 వేల మెజార్టీతో గెలువబోతున్నానని పేర్కొన్నారు. తన గెలుపు రాష్ట్ర, దేశ రక్షణకు తొలి మెట్టు అని వివరించారు. పోలీసులను అడ్డు పెట్టుకుని సీఎం కేసీఆర్ దుర్వినియోగానికి పాల్పడ్డారని వివరించారు. తమ లాంటి యువతకు కేసీఆర్ ఏం మెసేజ్ ఇస్తున్నారని అడిగారు.

ఫస్ట్ ప్లేస్ తనదే
ఇదివరకు కూడా ఫస్ట్ ప్లేస్ తమదేనని కేఏ పాల్ అన్నారు. ఆ వీడియో ట్రోల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ కూడా ఆయన విజయంపై విశ్వాసంతో ఉన్నారు. 6వ తేదీ.. ఆదివారం రోజున కౌంటింగ్ జరగనుంది. ఆ రోజు ఫలితం రానుంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం టీఆర్ఎస్ వైపు నిలిచాయి. మరీ ఫలితం ఎలా ఉండనుందో చూడాలీ మరీ. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి విజయం తప్పనిసరి. ఆయన ఓడిపోతే.. రాజకీయ జీవితం దాదాపు శూన్యమే అవుతుంది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications