తెలంగాణలో రానున్న 3 రోజులు పొడి వాతావరణమే: ఈ జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు
హైదరాబాద్: గత రెండు రోజుల క్రితం వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలతో బీభత్సం సృష్టించిన వరణుడు శాంతించాడు. శనివారం నుంచి తెలంగాణలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినట్లే కనిపించింది. ఆదివారం కూడా సూర్యుడు దర్శనమివ్వడంతో ప్రజలంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ క్రమంలో మరో మూడు రోజులపాటు వాతావరణ శాఖ పలు సూచనలు చేసింది.
రానున్న మూడు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే, అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరంలో అల్పపీడనం ఏర్పడినట్లు పేర్కొంది.

ఈ నేపథ్యంలో ఆగస్టు 1వ తేదీన ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆగస్టు 2న కుమురంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
కాగా, గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలే పడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట మండలంలో 22.7 మి.మీ, మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో 21.4 మి.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 17.1 మి.మీ, ఖమ్మం జిల్లా వేంసూరులో 14.3 మి.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలో 13.4 మి.మీ వర్షం కురిసింది.
వరంగల్ జిల్లా చెన్నరావుపేటలో 12.6 మి.మీ, జనగామ జిల్లాలోని జఫర్‌గఢ్‌లో 11.4 మి.మీ, వరంగల్ జిల్లాలోని నెక్కొండలో 11.2 మి.మీ, రాయపర్తిలో 9.6 మి.మీ, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో 9.2 మి.మీ. వర్షపాతం నమోదైంది.మరోవైపు, దేశంలోని పలు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవారంపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications