మూడు రోజులపాటు తెలంగాణకు రెయిన్ అలర్ట్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ తోపాటు అన్ని జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులు, చెరువులు నిండు కుండల్లా మారాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
తాజాగా, మరోసారి వాతావరణ శాఖ వర్ష సూచనలు చేసింది.

రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతం బంగ్లాదేశ్​ తీరం గ్యాంగ్​టక్​, పశ్చిమ బెంగాల్​ ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీని అనుబంధ ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్లు ఎత్తు వరకు విస్తరించి ఉంది. అది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి వైపు వంగి, అదే ప్రాంతంలో కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

Next three days rain alert for Telangana districts

ఈ రెండింటి ప్రభావంతో తెలంగాణకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. శుక్రవారం గాలి విచ్ఛిన్నతి 18 డిగ్రీల ఉత్తర అక్షాంశం గుండా సగటు సముద్ర మట్టానికి 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు మధ్య వరకు విస్తరించి ఉంది. ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణం వైపు వంగి ఉందని తెలిపింది.

మూడు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలతోపాటు అక్కడక్కడ బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శుక్రవారం ఉదయం నుంచి కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు ఇప్పటికీ వరదనీటిలోనే ఉండటంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+