Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్ తోపాటు తెలంగాణలో వణకిస్తున్న చలి, మండుతున్న ఎండలు: ఎల్లో అలర్ట్ జారీ

గత కొద్ది రోజులుగా రాజధాని నగరంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి.అయితే, పగటిపూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటుండగా.. రాత్రి పూట మాత్రం చలి వణికిస్తోంది.

హైదరాబాద్: గత కొద్ది రోజులుగా రాజధాని నగరంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి.అయితే, పగటిపూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటుండగా.. రాత్రి పూట మాత్రం చలి వణికిస్తోంది. హైదరాబాద్ తోపాటు తెలంగాణ జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది.

హైదరాబాద్‌లో పెరుగుతున్న వేడి.. మరోవైపు చలి

హైదరాబాద్‌లో పెరుగుతున్న వేడి.. మరోవైపు చలి

హైదరాబాద్‌లో రోజురోజుకు వేడి పెరిగిపోతోంది. అయితే, తెల్లవారుజామున, రాత్రులు చలిగా మాత్రం చలి తీవ్రంగా ఉంటోంది. మంగళవారం ఉదయం వివిధ ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 14 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతుండటం గమనార్హం. కొన్ని ప్రాంతాల్లో ఒక అంకెకు కూడా పడిపోవడంతో నగరం పొగమంచు దుప్పటి కప్పుకుంది.

పటాన్‌చెరువులో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత నమోదు

పటాన్‌చెరువులో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత నమోదు

మరో రెండు రోజుల పాటు నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున నగరంలో సగటు కనిష్ట ఉష్ణోగ్రత 15.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

రామచంద్రపురం, పటాన్‌చెరువులో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 8.7 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది.తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టిఎస్‌డిపిఎస్) ప్రకారం.. గురువారం వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు 14 నుంచి 16 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రతలు 32 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది.

తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ: మండిపోనున్న ఎండలు

తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ: మండిపోనున్న ఎండలు

రానున్న మూడు రోజుల పాటు కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి సహా పలు జిల్లాలకు ఐఎండీ అధికారులు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. మంగళవారం కుమురం భీమ్ ఆసిఫాబాద్‌లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 6.7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.

మరోవైపు, ఫిబ్రవరి 22 తర్వాత ఎండలు తీవ్రంగా ఉండనున్నాయి. రాష్ట్రంలో ఫిబ్రవరి మూడో వారం నుంచి వేసవి కాలం ఎండలు ప్రారంభమవుతాయని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, మరో రెండు రోజులపాటు మాత్రం చలి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ శాస్త్రవేత్త శ్రావణి తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+