బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి దీక్ష భగ్నం, క్షీణించిన ఆరోగ్యం: కిషన్ రెడ్డి నిర్మల్ పర్యటన వాయిదా
ఆదిలాబాద్: నిర్మల్ నూతన మాస్టర్ ప్లాన్‌తో పాటు జీవో నెంబర్ 220ని రద్దు చేయాలంటూ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వ ర్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను సోమవారం తెల్లవారుజామున పోలీసులు భగ్నం చేశారు. భారీ సంఖ్యలో చేరుకున్న అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఆయన దీక్షను విరమింపజేసేందుకు ప్రయత్నించారు.
వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా ఆస్పత్రికి మహేశ్వర్ రెడ్డిని తరలించారు. అక్కడే ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే, ఆస్పత్రిలోనే మహేశ్వర్ రెడ్డి తన దీక్షను కొనసాగిస్తున్నారు. తన దీక్షను బలవంతంగా భగ్నం చేసేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. నిర్మల్ మాస్టర్ ప్లాన్, జీవో నెంబర్ 220ని రద్దు చేసే వరకూ తన దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు.

కాగా, మహేశ్వర్ రెడ్డి ఆరోగ్యం బాగా క్షీణించిన వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్య కోసం హైదరాబాద్ తరలించాలని భావించినా.. మహేశ్వర్ రెడ్డి అంగీకరించలేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహేశ్వర్ రెడ్డిని పలువురు బీజేపీ నేతలు పరామర్శించారు. ఆయన దీక్షకు సంఘీభావం ప్రకటించారు. సీఎం కేసీఆర్, నిర్మల్ మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మరోవైపు, నిర్మల్ మాస్టర్ ప్లాన్ కోసం తెచ్చిన జీవో 220ని వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపేందుకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సోమవారం నిర్మల్ వెళ్లాలని నిర్ణయించారు. అంతేగాక, శనివారం పోలీసుల లాఠీఛార్జీలో గాయపడిన బీజేపీ కార్యకర్తలను కూడా పరామర్శించాలని భావించారు.
అయితే, అత్యవసరంగా పార్టీ నేతలతో సమావేశం కావాల్సి ఉండటంతో నిర్మల్ పర్యటనను కిషన్ రెడ్డి తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. కాగా, ఆదివారం నిర్మల్ వెళుతున్న మాజీ మంత్రి, బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ ధర్మపురి అరవింద్‌ను పోలీసులు అడ్డుకున్నారు.
మరోవైపు, నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జీ చేసి చెదరగొట్టారు. ఈ క్రమంలో సోమవారం మహేశ్వర్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. దీంతో ఆయన ఇంటి వద్ద పోలీసులు మోహరించారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications