హైదరాబాద్‌లో రిలయన్స్ స్వదేశ్ స్టోర్ ప్రారంభించిన నీతా అంబానీ: రాంచరణ్, నమ్రత సందడి
హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ హైదరాబాద్ నగరంలో సందడి చేశారు.దేశంలోనే మొట్టమొదటి స్వదేశ్ స్టోర్ (Swadesh Store)ను రియలన్స్ సంస్థ నగరంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన అతిపెద్ద ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ స్వదేశ్ స్టోర్‌ను నీతా అంబానీ బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ.. హైదరాబాద్ అంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు. మొట్టమొదటి రిలయన్స్ రిటైల్ స్టోర్‌ను కూడా హైదరాబాద్‌లోనే ప్రారంభించినట్లు తెలిపారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో ముంబై ఇండియన్స్ జట్టు కూడా ఇక్కడ రెండు టైటిల్స్ గెలిచిందని నీతా అంబానీ చెప్పారు.

హస్త కళలను ఆదరించడం, కళాకారులను ప్రోత్సహించడంలో భాగంగానే స్వదేశ్ స్టోర్‌ను ఏర్పాటు చేసినట్లు నీతా అంబానీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీనటుడు రామ్ చరణ్ తేజ్-ఉపాసన దంపతులు, మంచు లక్ష్మి, నమ్రతా, క్రీడాకారిణిలు పీవీ సింధు, సానియా మీర్జా తదితరులు పాల్గొన్నారు.

#WATCH | Nita Ambani, Founder and Chairperson, Reliance Foundation met Sania Mirza, PV Sindhu, Namrata Shirodkar and others at the launch of the first standalone Swadesh store at Alcazar Mall, Jubilee Hills, Hyderabad. pic.twitter.com/2drepDRIWy
— ANI (@ANI) November 8, 2023
కాగా, ఈ స్వదేశ్ స్టోర్‌లో ప్రత్యేక భౌగోళిక గుర్తింపు పొందిన దేశీయ హస్తకళా ఉత్పత్తులు, వ్యవసాయోత్పత్తులు, చేనేత వస్త్రాలు వంటివి ఉంటాయి. ఇంకా హ్యాండీక్రాఫ్ట్స్, ఫర్నీచర్, ఆర్ట్ ఆబ్జక్ట్స్, టాయ్స్, మాస్క్‌లు, జ్యువలరీ, పప్పట్స్, డైనింగ్, పెయింటింగ్స్, కిచెన్‌కు హోంవేర్, షాల్స్, అప్పారల్, శారీస్, హోంలినెన్, ఫ్యాబ్రిక్స్, వెల్‌నెస్ ప్రొడక్టులు కూడా ఈ స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి.
VIDEO | "I am delighted that the flagship store of 'Swadesh' has opened in Hyderabad. I wish all the best to Nita (Ambani). It's truly our pleasure to have her here," says actor Namrata Shirodkar at the launch of the first 'Swadesh' handicrafts store in Hyderabad. pic.twitter.com/og4yXBstps
— Press Trust of India (@PTI_News) November 8, 2023
-
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications