ఎవ్వరినీ వదిలిపెట్టం: గంగారెడ్డి హత్యపై మంత్రి శ్రీధర్ బాబు
జగిత్యాలలో కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్య కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హత్య ఎవరు చేసినా, ఎవరు చేయించినా వదిలేది లేదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఇప్పటికే జిల్లా ఎస్పీతో మాట్లాడినట్లు మంత్రి తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డితో మాట్లాడానని తెలిపారు.
జీవన్ రెడ్డి పార్టీలో అత్యంత సీనియర్ నేత అని, ఆయన సేవలను తాము వినియోగించుకుంటామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలిగించమని అన్నారు. చనిపోయిన కాంగ్రెస్ నేత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు.

కాగా, జగిత్యాల జిల్లా రూరల్ మండలం జాబితాపూర్‌లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు, మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. సంతోష్ అనే వ్యక్తి గంగారెడ్డిని కారుతో ఢీకొట్టారని, ఆ తర్వాత కత్తితో పొడిచినట్లు స్థానికులు తెలిపారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ గంగారెడ్డిని స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మరణించినట్లు చెప్పారు. గ్రామంలో రాజకీయ కక్షలే హత్యకి ప్రధాన కారణమని తెలిసింది.
ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి సహా కాంగ్రెస్ శ్రేణులు జగిత్యాల- ధర్మపురి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. తమ్ముడి లాంటి వ్యక్తిని కోల్పోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాలో బీఆర్ఎస్ రాజ్యం నడుస్తోందా? లేక కాంగ్రెస్ రాజ్యం నడుస్తోందా? అని సొంత పార్టీపై అసహనం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలకే రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి ఎంతో కాలంగా సేవ చేస్తున్నానని.. అయినా తనకు అవమానాలు ఎదురవుతున్నాయని వాపోయారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలకు కాకుండా... ఫిరాయింపులకు పాల్పడిన వారికి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడంపై జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పార్టీలకు నైతిక విలువలు ఉండాలని సూచించారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications