Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మోగిన నగారా.. స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ !!

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగరా మోగింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు తమ జిల్లాల పరిధిలో నోటిఫికేషన్లు జారీ చేశారు. రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారికంగా వెల్లడించారు.

కాగా మొదటి విడతలో రాష్ట్రంలోని 31 జిల్లాలకు చెందిన 58 రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 292 జడ్పీటీసీ మరియు 2,963 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. నేటి నుంచి నామినేషన్లను స్వీకరించనుండగా.. ఈ నెల 11న నామినేషన్లకు చివరి తేదీగా స్పష్టం చేశారు. ఈనెల 12న నామినేషన్ల పరిశీలన ఉండగా.. ఈ నెల 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఈనెల 23న మొదటి విడత ఎన్నికలు జరగనుండగా.. నవంబర్‌ 11న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు తమ ప్రాంతంలోని మండల లేదా జిల్లా కార్యాలయాల్లో నామినేషన్లు దాఖలు చేయవచ్చు.

notification-released-for-local-body-elections-in-telangana

డిపాజిట్ వివరాలు..

జడ్పీటీసీ..

జనరల్ అభ్యర్థి: రూ.5,000 డిపాజిట్.

రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థి: రూ.2,500.

ఎంపీటీసీ..

జనరల్ అభ్యర్థి: రూ.2,500.

రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థి: రూ.1,250.

ఎన్నికల ఖర్చు పరిమితులు..

రాష్ట్ర ఎన్నికల సంఘం అభ్యర్థుల ఖర్చు పరిమితులను కూడా ఖరారు చేసింది.

జడ్పీటీసీ అభ్యర్థి: గరిష్టంగా రూ.4 లక్షలు.

ఎంపీటీసీ అభ్యర్థి: రూ.1.5 లక్షలు.

సర్పంచ్ అభ్యర్థి: రూ.2.5 లక్షలు.

ఈ పరిమితిని అతిక్రమిస్తే అభ్యర్థి మూడు సంవత్సరాలపాటు పోటీ చేయలేరు. గెలిచినా పదవిని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎన్నికల ఫలితాల అనంతరం 45 రోజులలోపు ఖర్చు నివేదికను సమర్పించాలి.

ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష..

ఇక ఇప్పటికే మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఐ. రాణీకుముదిని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమయ్యారు. ఎన్నికల ఏర్పాట్ల పురోగతిపై సమీక్ష చేసి, పకడ్బందీగా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలని సూచించారు. ఇప్పటికే ఎన్నికల అధికారులకు శిక్షణ, పునఃశ్చరణ కార్యక్రమాలు పూర్తి అయ్యాయని కలెక్టర్లు తెలిపారు.

నోటిఫికేషన్ వెలువడిన వెంటనే గ్రామాల్లో రాజకీయ వేడి మొదలైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ టికెట్ల కోసం ఆశావహులు తమ పార్టీ నేతల వద్ద లాబీయింగ్ ప్రారంభించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల అనంతరం సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+