హైదరాబాద్‌లోని వాహనదారులకు బిగ్ అలెర్ట్.. అటువైపు వెళ్లొద్దు..

హైదరాబాద్‌లోని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు బిగ్ అలెర్ట్ జారీ చేశారు. సిటీలోని ఎల్బీ స్టేడియం వైపు వెళ్లొద్దని తెలిపారు. ఈ మేరకు అడ్వైజరీ జారీ చేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లీడ్ రోల్‌ లో నటించిన ఓజీ సినిమా మ్యూజికల్ కన్సెర్ట్ జరుగుతున్న క్రమంలో విపరీతమైన రద్దీ కారణంగా వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు. వాహనాలను ఆపివేస్తున్నట్లు ట్రాఫిక్ జామ్ కారణంగా ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.

ఓజీ సినిమా మ్యూజికల్ కన్సెర్ట్ సెప్టెంబర్ 21 న సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది. ఈ వేడుకకు అధిక సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉంది. ట్రాఫిక్ రద్దీ కారణంగా వాహనాల రాకపోకలను ఆపివేయటం లేదా దారి మళ్లించడం జరుగుతుందని ట్రాఫిక్ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఏఆర్ పెట్రోల్ పంప్ జంక్షన్ (పబ్లిక్ గార్డెన్స్) వైపు నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వెళ్లే వాహనాలను అనుమతించకుండా.. ఆ వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంప్ జంక్షన్ నుంచి నాంపల్లి వైపునకు దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు. అలాగే బషీర్ బాగ్ నుంచి ఏఆర్ పెట్రోల్ పంప్ జంక్షన్ వైపు వచ్చే వాహనాలను బీజేఆర్ విగ్రహం వద్ద ఆపేసి వాటిని ఎస్బీఐ, అబిడ్స్- నాంపల్లి రైల్వే స్టేషన్ రోడ్డు వైపునకు దారి మళ్లిస్తున్నట్లు వివరించారు. ఇక సుజాత స్కూల్ రోడ్డు వైపు నుంచి వచ్చే వాహనాలను ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపునకు వచ్చే వాహనాలను.. సుజాత స్కూల్ జంక్షన్ నుంచి నాంపల్లి వైపు దారి మళ్లించనున్నట్లు హైదరాబాద్ పోలీసులు కీలక అడ్వైజరీ జారీ చేశారు.

OG Concert Chaos Hyderabad Traffic Diverted Near LB Stadium Pawan Kalyan Fans Swarm the Streets

ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లీడ్ రోల్‌ లో నటించిన ఓజీ సినిమా కోసం అభిమానులతో పాటు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దసరా కానుకగా ఈ మూవీ సెప్టెంబర్ 25 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌ కు సిద్ధమైంది. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+