నేడు ఎనిమిదోరోజు వెన్నముద్దల బతుకమ్మ.. ఏం చేస్తారంటే!!
తెలంగాణ కీర్తిని దిశ దిశలా చాటే పండుగ బతుకమ్మ పండుగ. భూమికి, నీటికి, ప్రకృతికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుపుతూ జరుపుకునే ఈ పండుగ చాలా ప్రత్యేకతను సంతరించుకున్న పండుగ. వర్షాకాలం, శీతాకాలం సంధికాలంలో వచ్చే అంటువ్యాధుల నుండి, కరువు కాటకాల నుండి మనల్ని కాపాడి, పాడిపంటలతో, ప్రజలంతా సంతోషంగా ఉండాలని గౌరమ్మను అందరూ ప్రార్థించే పండుగ బతుకమ్మ పండుగ.
బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడవరోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు నానే బియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ జరుపుకుంటారు. ఆరవ రోజు అలిగిన బతుకమ్మగా బతుకమ్మను జరుపుకోరు, మళ్లీ ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మను జరుపుకుంటారు.

నేడు 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మను జరుపుకోవడానికి మహిళలందరూ రెడీ అయ్యారు. వెన్న ముద్దుల బతుకమ్మ కోసం ప్రసాదంగా వెన్న, నెయ్యి, నువ్వులు మరియు బెల్లంతో చేసిన వంటకాన్ని సిద్ధం చేసుకుంటారు. ఈరోజు వాయనంగా నువ్వులు, బెల్లం కలిపి ప్రసాదంగా ఇచ్చిపుచ్చుకుంటారు. ఇక వెన్న ముద్దలను తయారు చేయడానికి గిన్నెలో అర కప్పు బియ్యం పిండిని వేసుకొని, అందులో రెండు స్పూన్ల వెన్న, కాస్త వేడినీళ్లు పోసి ముద్దగా కలుపుకోవాలి.
ఇప్పుడు చిన్న చిన్న ముద్దలను తీసి గులాబ్ జామ్ లా గుండ్రంగా ఉండలుగా చేసుకోవాలి. అలా గుండ్రని ముద్దులు తయారైన తరువాత వాటిని నూనెలో వేయించాలి. పంచదార పాకం తయారు చేసుకొని, వేయించిన వెన్న ముద్దలను ఆ పాకంలో వేయాలి. ఈ వెన్నముద్దల నైవేద్యాన్ని అమ్మవారికి నివేదించాలి.
ఇక ఎనిమిదవ రోజున వెన్నముద్దల బతుకమ్మలో భాగంగా మహిళలందరూ బతుకమ్మలను పేర్చి ఆడి పాడి బతుకమ్మ వేడుకలు చేసుకుంటారు. తంగేడు, గునుగు, చామంతి, గులాబీ, గడ్డిపువ్వు పూలతో 8 దొంతరలుగా వెన్న ముద్దుల బతుకమ్మను పేర్చి, ఆలయాల వద్ద ఆడవారంతా చేరి ఆడి పాడుతారు. ఆపై బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేస్తారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications