పోకిరి అరెస్ట్: 'ప్రేమిస్తున్నా, నీవు పెళ్ళి చేసుకోవద్దు', యువతికి వేధింపులు
హైదరాబాద్: గతంలో ఓ యువతితో పరిచయంతో తీసుకొన్న ఫోటోను ఆధారంగా వేధింపులకు గురి చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తనను పెళ్ళి చేసుకోవాలని భాదితురాలిని వేధింపులకు గురిచేశాడు. ఆ యువతికి కాబోయే భర్తకు కూడ ఫోటోలను పంపి బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు. ఎట్టకేలకు నిందితుడిని శనివారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.
హైద్రాబాద్ కు చెందిన ముస్తఫా అనే యువకుడితో ఓ యువతితో పరిచయం ఉంది. ఈ పరిచయం కారణంగా గోల్కొండ కోటలో ముస్తఫాతో ఆ యువతి ఫోటోలు దిగింది. తరచూ ఫేస్ బుక్ లో ఆ యువతితో నిందితుడు చాటింగ్ చేసేవాడు.ఫోన్ లో మాట్లాడేవాడు.
అయితే కొంత కాలం తర్వాత ముస్తపా తనలోని మరో రూపాన్ని చూపాడు. ఆ యువతిని పెళ్ళి చేసుకొంటానని ఫేస్‌బుక్ లో చాటింగ్ లో కోరేవాడు. కానీ ఆ యువతి మాత్రం తిరస్కరించింది. అయినా వేదింపులను మాత్రం ఆపలేదు.

ఫోటోలు పంపి బ్లాక్ మెయిల్
ముస్తఫాతో ఆ యువతి దిగిన ఫోటోలను ఫేస్‌బుక్ లో అప్ లోడ్ చేసేవాడు. తనకు మరోకరితో వివాహం నిశ్చయమైందని ఆ యువతి ప్రాధేయపడినా కానీ, అతడు వినలేదు. ఆ యువతి ఫోటోలను ఫేస్ బుక్ లో అప్‌లోడ్ చేయడమే కాకుండా ఆ యువతి వివాహం చేసుకోనున్న వ్యక్తికి కూడ తనతో ఆ యువతి దిగిన ఫోటోలను నిందితుడు పంపాడు. యువతిని బ్లాక్ మెయిల్ చేశాడు.

ప్రేమలో ఉన్నాం పెళ్ళి చేసుకొంటాం
తామిద్దరం ప్రేమించుకొంటున్నాం, ఆ అమ్మాయిని వివాహం చేసుకొంటానని ముస్తఫా యువతికి కాబోయే భర్తకు ఫోటోలు పంపి మరీ చెప్పాడు. ఆ అమ్మాయిని వివాహం చేసుకోకూడదని కోరాడు. రోజు రోజూకు ముస్తపా వేధింపులు భరించలేక ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది.

ముస్తఫాపై పోలీసుల నిఘా
యువతి షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ముస్తఫాపై నిఘాను ఏర్పాటు చేశారు. ఈ నిఘా ఆధారంగా పోలీసులు ముస్తఫాను ఎక్కడ ఉన్నాడో గుర్తించి అరెస్ట్ చేశారు. హైద్రాబాద్ నెక్లెస్ రోడ్డులోని సంజీవయ్య పార్క్ వద్ద ముస్తఫాను శనివారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.

యువతులను వేధిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు
ముస్తఫా సంజీవయ్య పార్క్ వద్ద మరికొందరితో కలిసి యువతులను వేధిస్తున్నాడు. అదే సమయంలో పోలీసులు ముస్తఫా ఉపయోగించే సెల్‌ఫోన్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. యువతులను వేధిస్తున్న ముస్తఫాను పోలీసులు అరెస్ట్ చేశారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications