ఇక కన్ఫామ్ టికెట్ ఉంటేనే- రైల్వే కీలక నిర్ణయం..!!

రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యల పైన ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఢిల్లీలో జరిగిన తొక్కిసలాట.. పలువురు ప్రాణాలు కోల్పోవ టంతో తక్షణ చర్యల పైన రైల్వే శాఖ ఫోకస్ చేసింది. మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక సమీక్ష చేసారు. అందులో భాగంగా రైల్వే స్టేషన్లలో ప్రధాన రైళ్లు వచ్చే వేళ.. అధికంగా రద్దీగా ఉండే స్టేషన్లు గా దేశ వ్యాప్తంగా గుర్తించిన 60 స్టేషన్లలో ఒక ప్లాట్ ఫాం పైకి అనుమతించే విషయంలో నిర్ణయం తీసుకున్నారు.

కన్ఫామ్ టికెట్ ఉంటేనే
ఇకపై కన్ఫామ్ టికెట్ ఉన్న ప్రయాణికులను మాత్రమే ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతించనున్నారు. దేశంలో అతిపెద్దవైన 60 రైల్వే స్టేషన్లలో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. స్టేషన్లలో రద్దీని తగ్గించడంతో పాటు ప్రయాణికుల భద్రతను నిర్ధారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణీకులను సాగనంపేందుకు కోసం బంధువులు, మిత్రులు ప్రధాన స్టేషన్లలో పెద్ద సంఖ్యలో వస్తున్న విషయాన్ని రైల్వే అధికారులు వివరించారు. దీని కారణం గా అసలైన ప్రయాణీకులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయనే అంశం పైన ఈ సమీక్ష లో చర్చ జరిగింది. దీంతో, ఈ నిర్ణయం తీసుకున్నారు.

Only confirmed ticket holders will be allowed access to railway platforms

ఈ స్టేషన్లలో అమలు
దేశ వ్యాప్తంగా రద్దీ ఎక్కువగా ఉండే 60 ప్రధాన రైల్వే స్టేషన్లలో ఈ విధానం ముందుగా అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. ఢిల్లీ, ముంబాయి, చెన్నై, బెంగళూరు సిటీ, ఛత్రపతి రైల్వే స్టేషన్ తో పాటుగా పలు ముఖ్యమైన జంక్షన్లు అందులో ఉన్నాయి. ప్లాట్ ఫాం మీదకు ప్రయాణీకులను మాత్రమే అమలు చేయనున్నారు. ఇక, వారితో వచ్చే వారికి ప్లాట్ ఫాం మీదకు అనుమతించరు. స్టేషన్ ప్రాంగణంలోనే వారికి వీడ్కోలు పలకాల్సి ఉంటుంది. తొలి విడతలో ఈ 60 స్టేషన్లలో అమలు ప్రక్రియ పరిశీలించిన తరువాత విడతల వారీ గా దేశ వ్యాప్తంగా అమలు చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది.

కీలక నిర్ణయాలు
ఇదే సమీక్షలో మరి కొన్న కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎంపిక చేసిన స్టేషన్లలో ప్లాట్ ఫాంల పైన రద్దీని పర్యవేక్షించి.. నియంత్రించేందుకు సీసీ కెమేరాలతో పాటుగా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్లాట్ ఫాం ల పైన సమన్వయం కోసం స్టేషన్లలో పని చేసే రైల్వే సిబ్బందిని అదనంగా నియమించనున్నారు. ఈ నిర్ణయాలు తక్షణం అమల్లోకి తీసుకురావాలని డిసైడ్ అయ్యారు. దీంతో, ఇక ఈ 60 రైల్వే స్టేషన్లలో కన్ఫర్మ్ టికెట్ ఉంటేనే ప్లాట్ ఫాం పైకి ఎంట్రీ దక్కనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+